Tellam Venkata Rao : లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ తెలంగాణ(Telangana) లో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు, GHMC మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది.
సొంత గూటిలోకే..
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కి సొంత పార్టీ నేతలే షాకులు ఇస్తున్నారు. పార్టీలో తమకు భవిష్యత్ ఉండదనే ఆలోచనతో కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు(Tellam Venkata Rao) పేరు చేరింది. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో తెల్లం వెంకట్రావ్ చర్చలు జరువుతున్నట్లు భద్రాచలం నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యే పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు ఆయన సొంత గూటికి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి తెల్లం వెంకటరావుతెల్లం వెంకటరావు ఎప్పుడు కాంగ్రెస్ లో చేరుతారో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
Also Read : అదే మా మూలసూత్రం.. మూడోసారి గెలుపుపై అనుమానం లేదు : మోడీ
ఖమ్మంలో కారు తుస్..
భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఖమ్మంలో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలోని మొత్తం 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. అది కూడా భద్రాచలం లోనే.. తాజాగా ఆ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడంతో ఖమ్మంలో గులాబీ జెండా ఇక లేనట్టే అని రాష్ట్ర రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.