Shoaib Malik : మరో పెళ్ళి చేసుకున్న షోయబ్ మాలిక్? రూమర్స్ నిజం అయ్యాయా...అందరూ అనుకున్నట్టుగానే సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు విడిపోయారా అంటే అవుననే అనిపిస్తోంది. షోయబ్ మాలిక్, పాకిస్తాన్ హీరోయిన్ సనా పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌లు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇందులో వాళ్ళిద్దరూ పెళ్ళి దుస్తుల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. By Manogna alamuru 20 Jan 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Second Marriage : పాకిస్తాన్(Pakistan) బౌలర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మరో పెళ్ళి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్(Sana Javed) ను వివాహం(Marriage) చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా షోయబ్ మాలిక్ తనే స్వయంగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టి మరీ చెప్పాడు. ఇందులో తమ పెళ్ళి ఫోటోలు పెట్టి జంటగా మేము ఇలా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షోయబ్, సనాలు పెళ్ళి దుస్తుల్లో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. అంతకు కొన్ని గంటల ముందు సానియా కూడా డివోర్స్ హార్డ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో షోయబ్, సానియాలు విడిపోయారని కన్ఫార్మ్ అయిపోయింది. - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 Also read:వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం సానియాతో వివాహం... షోయబ్ మాలిక్‌కు ఇదిరెండో వివాహం. టెన్నిస్ స్టార్, హైదరాబాద్(Hyderabad) అమ్మాయి సానియా మీర్జా(Sania Mirza), షోయబ్‌లో 201లో పెళ్ళి చేసుకున్నారు. సంప్రదాయ ముస్లిమ్ పద్దతిలో వీరి పెళ్ళి జరిగింది. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే గత కొంత కాలంగా సానియా, షోయబ్‌లు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టు సానియా దుబాయ్‌లో, షోయబ్ పాకిస్తాన్లో ఉండడం కూడా అనుమానాలకు దారి తీసింది. కానీ ఈ విషయం మీద సానియా కానీ, షోయబ్ కానీ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. నటితో ఫోటో ఫూట్.. షోయబ్, నటి సనాకు మధ్య ఎపైర్ నడుస్తోందనే రూమర్ కూడా చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది. వీళ్ళిద్దరూ ఓ ఫోటో షూట్లో సన్నిహితంగా కనిపించడం...కరెక్ట్‌గా అదే సమయంలో సానియా హృదయం ముక్కలైంది అంటూ పోస్ట్ పెట్టడం కూడా జరిగంఇది. అప్పటి నుంచే సానియా, షోయబ్‌లు విడిపోయారని వార్తలు వస్తూనే ఉన్నాయి. దాని తరువాత దుబాయ్‌లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో షోయబ్ అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు. దీంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. #shoaib-malik #sania-mirza #second-marriage #sana-javed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి