/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nbk-jpg.webp)
NBK : నందమూరి నటసింహం హిట్ల మీద హిట్లు అందుకుంటు ముందుకు దూసుకుపోతున్నారు. 2023 జనవరి లో సంక్రాంతి(Sankranti) కి విడుదలైన వీరసింహారెడ్డి మొదలుకుని ఏడాది చివరిలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అదే పరంపర కొనసాగించాలని బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు.
ఈ క్రమంలోనే బాలయ్య బాబు(Balakrishna) తన తరువాత చిత్రం వాల్తేరు వీరయ్య సినిమాతో విజయం సాధించి జోష్ మీదున్న యంగ్ డెరైక్టర్ బాబీ(Director Babi) తో తీయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రం బృందం ఎన్బీకే 109 నుంచి ఓ కీలక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
Get ready to witness the COOLEST & CRUELLEST form of #NBK, this Maha Shivarathri! 🪓🔥#NBK109Glimpse ~ Unveiling Tomorrow! 🤘💥 #NBK109 #NandamuriBalakrishna @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/bNkeQkzqah
— Bobby (@dirbobby) March 7, 2024
ఆ పోస్టర్ లో బాలయ్య ఫేస్ కనిపించకుండా చిత్ర బృందం ఓ చేతిలో గొడ్డలితో వెహికల్ దిగుతున్నట్లు విడుదల చేసింది. పోస్టరే పునకాలు తెప్పిస్తుంటే.. ఇక గ్లింప్స్ విడుదల అయితే ఎలా ఉంటుంది అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య మరోసారి రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిపోయాడని అభిమానులు సంబరపడుతున్నారు.
Also Read : మహిళా దినోత్సవం రోజున మహిళలకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ. 100 తగ్గింపు!