Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో రాష్ట్రంలో దుమారం రేగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh) ఈరోజు పెద్ద ప్రకటన చేశారు. నేను ముఖ్యమంత్రి పదవికి పోటీదారుని కాదు అని ఆయన అన్నారు. నేను కార్యకర్తను మాత్రమే. ఈ విషయంలో బీజేపీ నాకు ఏ పని ఇచ్చినా నిజాయతీతో చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో(Madhya Pradesh Elections) 230 స్థానాలకు గానూ బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ 66 స్థానాలకే పరిమితమైంది. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, CM శివరాజ్ మాట్లాడుతూ, “మోదీ (PM Modi) మా నాయకుడు. ఆయనతో కలిసి పనిచేయడం విశేషం.నేను బీజేపీ కార్యకర్తను కావడం గొప్ప అదృష్టం. ప్రజలకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను చేయగలిగినంత పని చేసాను. ” అని పేర్కొన్నారు.
Also Read: ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఆఫీసర్.. మిజోరాం ముఖ్యమంత్రి! పాతికేళ్ల నిరీక్షణ ఫలించింది!
శివరాజ్ బీజేపీ విజయంలో హీరో..
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో సీఎం శివరాజ్ హీరోగా నిలిచారని విశ్లేషకులు చెబుతున్నారు. 64 ఏళ్ల శివరాజ్ రాష్ట్రంలోని అధికార వ్యతిరేకతను ఓడించి మరోసారి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. బీజేపీ ఈ విజయం వెనుక అత్యంత చర్చనీయాంశమైన పథకం 'లాడ్లీబెహానా' ఉంది. ఇది గేమ్ ఛేంజర్‌గా పరిగణిస్తున్నారు. అయితే, ఎన్నికలకు ముందు పార్టీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పలేదు. ఇక్కడ ప్రచారం అంతా ప్రధాని మోదీ కేంద్రంగా సాగింది.
శివరాజ్ చరిత్ర సృష్టించారు..
రైతు కుటుంబంలో జన్మించిన శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం అంటే 16 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగి చరిత్ర సృష్టించారు. నాలుగు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆయన ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి సారథ్యం వహించవచ్చు. సీఎం పోటీదారుల జాబితాలో శివరాజ్ పేరు అగ్రస్థానంలో ఉంది.
Watch this Interesting Video: