ప్రవళిక ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన ప్రవళిక బాయ్‌ఫ్రెండ్ శివరాం రాథోడ్‌ను పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచగా అతను సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్లో సాంకేతిక పొరపాట్లు ఉండటం వల్ల అది తిరస్కరణకు గురైంది. దీంతో శివరాం రాథోడ్ కోర్టు బయటకు రాగా.. అప్పటికే అక్కడ ఉన్న చిక్కడపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక శనివారం శివరాంను గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పోలీసులు రిమాండ్ రిపోర్టులో నిందితుడిపై సరైన ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే విషయంలో పోలీసులపై కోర్టు ప్రశ్నల వర్షం గుప్పించింది. చివరికి మెజిస్ట్రేట్ జీ ఉదయ్‌భాస్కర్‌రావు శివరాంకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. దీంతో శివరాం రాథోడ్‌ను రిమాండ్‌కు తరలించకుండానే అతడ్ని విడుదల చేశారు. అయితే శివరాం రాథ్‌డ్‌కు ప్రవళిలకు ఎలాంటి సంబంధం లేదని.. అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేనందువల్లే కోర్టు శివరాంకు బెయిల్ మంజూరు చేసిందని.. అతని సోదరుడు తెలిపారు. కానీ దీనికి సంబంధించిన ఆర్డర్ ఇంకా రాలేదని పేర్కొన్నారు.
శివరాం రాథోడ్‌కు వేరే అమ్మాయితో ఇంకా నిశ్చితార్థం కాలేదని.. కేవలం పెళ్లి చూపులు మాత్రమే చూస్తున్నామని శివరాం బాబాయ్ తెలిపారు. ప్రవళిక ఆత్మహత్య ఘటన జరిగిన అనంతరం శివారాంపై ఆరోపణలు రావడంతో అతను భయబ్రాంతులకు గురయ్యాడని.. ఈ విషయంలో శివరాంకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఇంటర్యూని చూడండి.