ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..నిందితుడికి బెయిల్..!!
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రవళిక హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో సరైన సాక్షాధారాలు లేనందున శివరాంకు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తు తో వదిలేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.