/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-5-5-jpg.webp)
IPL: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీపై శివమ్ దూబె భార్య అంజుమ్ ఖాన్ (Anjum Khan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ధోనితో తమకున్న అనుబంధం, అభిమానం గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
నా భర్త శివమ్ ద్వారా కల నెరవేరింది..
ఈ మేరకు ‘ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోజుల్లో ఫస్ట్ టైమ్ ఓ న్యూస్ ఛానెల్‌లో ధోనీ పేరు విన్నా. ఆయన గురించి తెలియనంత వరకు నాకు క్రికెట్ అంటే ఇష్టం మాత్రమే ఉండేది. కానీ ధోనీ ఇంటర్వ్యూ మొత్తం చూసిన్నప్పనుంచి తెలియకుండానే క్రికెట్ మ్యాచ్‌లన్నీ చూస్తున్నా. ధోనీ ఆడే మ్యాచ్ అసలే మిస్ కానివ్వను. కష్టాల్లో ఉన్న జట్టును మహీ గెలిపిస్తాడనే ధైర్యం ఉంటుంది. ధోనీ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్ ఉండాలని నా కోరిక. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.
 Follow Us
 Follow Us