Shikhar Dhawan: మిథాలీ రాజ్‌‌తో పెళ్లి.. శిఖర్‌ ధావన్‌ ఏమన్నారంటే!

మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను శిఖర్ ధావన్ ఖండించాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మా మధ్య ఎలాంటి ప్రేమ, పెళ్లి సంబంధం లేదు’ అని స్పష్టం చేశాడు.

Shikhar Dhawan: మిథాలీ రాజ్‌‌తో పెళ్లి.. శిఖర్‌ ధావన్‌ ఏమన్నారంటే!
New Update

Shikhar Dhawan - Mithali Raj Marriage Rumours: మహిళా క్రికెటర్ మాజీ భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (Mithali Raj)ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై పురుషుల క్రికెట్ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) స్పందించాడు. ఈ మేరకు తాజాగా ‘ధావన్‌ కరేంగే’ షోలో పాల్గొన్న ధావన్.. అదంతా తప్పుడు ప్రచారమేనన్నాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మిథాలీ రాజ్‌‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదంతా పూర్తి అబద్ధం’ అని స్పష్టం చేశాడు.

ఇక ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్న వీరు తాము విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. ధావన్‌ దిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఐపీఎల్‌ టోర్నీలో పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ అయిన ధావన్ కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 152 పరుగులు చేశాడు. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మిథాలీ రాజ్‌ ప్రస్తుతం మహిళా ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోంది.

Also Read: ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ .. ఒక్క టికెట్ 16 లక్షలా? ICC పై లలిత్ మోదీ ఫైర్!

#shikhar-dhawan #mithali-raj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe