LSG vs PBKS : దంచికొట్టిన శిఖర్ ధవన్.. హాఫ్ సెంచరీతో అదుర్స్..!

పంజాబ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా రాణిస్తూ లక్ నవూ నిర్దేశించిన పరుగుల లక్ష్యానికి చేరువవుతున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేశాడు.

New Update
LSG vs PBKS : దంచికొట్టిన శిఖర్ ధవన్.. హాఫ్ సెంచరీతో అదుర్స్..!

Half Century : లక్నో సూపర్ జెయింట్స్(LSG) నిర్దేశించిన 200పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది పంజాబ్. ఓపెనర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్(Shikhar Dhawan) అర్థసెంచరీ పూర్తి చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. అతని స్థానంలో నికోలస్ పురాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ కింగ్స్‌కు చెందిన శిఖర్ ధావన్ తన మొదటి సిక్స్ కొట్టి... దూకుడుగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ జట్టుకు శుభారంభం అందించాడు. అతను బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక సిక్సర్ కొట్టి ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

శిఖర్ ధావన్ 2008 నుంచి ఐపీఎల్‌(IPL) లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో 220 మ్యాచ్‌లు ఆడి 6725 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. అతను 50 అర్ధ సెంచరీలు చేశాడు.పేలుడు బ్యాటింగ్‌లో ఎక్స్ పర్ట్ అయిన ధావన్.. కొన్ని బంతుల్లో మ్యాచ్ తనవైపునకు తిప్పుకునే సత్తా ఉంది. కాగా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. ఈ సీజన్‌లో శిఖర్ ధావన్ సారథ్యంలో రెండు మ్యాచ్‌లు ఆడిన జట్టు ఒకదానిలో ఓడి మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. రెండు పాయింట్లతో ఉన్న జట్టు ఐదో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి : పిల్లలు చెప్పిన మాట వినడం లేదని కొడుతున్నారా?

Advertisment
తాజా కథనాలు