Shaun Marsh Announces Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షాన్.. సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
జనవరి 16న చివరి మ్యాచ్..
ఈ మేరకు ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్ (BBL) టోర్నమెంట్ ఆడుతున్న అతను భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన గత మ్యాచ్ లో 49 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న మార్ష్.. జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. BBLలో ఇతను ఆల్ టైమ్ అత్యధిక రన్-స్కోరర్‌గా ఆరో స్థానంలో నిలిచాడు.
ఇది కూడా చదవండి : Kangana Ranaut: కంగనా రనౌత్ ప్రేమలో పడిందా? ఆమెతో చేతులు కలిపి నడుస్తున్న మిస్టరీ మ్యాన్ ఎవరు?
ఐపీఎల్ హీరో..
ఇక ఆస్ట్రేలియా (Australia) తరఫున 2008-19లో 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడిన ఆయన.. 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలతో 5000 పైగా పరుగులు చేశాడు. అంతేకాదు 2008-17 మధ్యలో ఐపీఎల్‌లోనూ అదరగొట్టేశాడు. ఐపీఎల్ (IPL) ఆరంభ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) తరఫున ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 రన్స్) నిలిచాడు. దాదాపు పదేళ్లు ఐపీఎల్ ఆడిన షాన్.. వివిధ ఫ్రాంచైజీలతో కలిసి మొత్తం 71 మ్యాచ్‌లాడగా ఒక సెంచరీ, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. 132 స్ట్రయిక్‌రేట్‌తో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన షాన్ 71 మ్యాచ్ ల్లోనే 2477 పరుగులు చేశాడు.
తండ్రి, తమ్ముడు క్రికెటర్లే..
ఇక షాన్ మార్ష్ ఫ్యామిలీ మొత్తం క్రికెటర్లు కావడం విశేషం. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకు షాన్ మార్ష్ కాగా.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ చిన్న కొడుకు. మిచల్ అండ్ షాన్ ఇద్దరూ అన్నదమ్ములే. ఇక ఇటీవలే డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోగా.. ఆరోన్ ఫించ్ కూడా అన్ని ఫార్మట్ ల నుంచి వైదిలిగిన విషయం తెలిసిందే.