Manamey : ఆకట్టుకుంటున్న శర్వానంద్ 'మనమే' టైటిల్ సాంగ్..!

శర్వానంద్ 'మనమే' సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 'మనమే' అంటూ సాగిన ఈ పాటను కార్తీక్, గీతా మాధురి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. హేషామ్ అబ్దుల్ వాహాబ్ స్వరపరిచారు. మెలోడీ టచ్ తో ఉన్న ఈ పాట ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది

New Update
Manamey : ఆకట్టుకుంటున్న శర్వానంద్ 'మనమే' టైటిల్ సాంగ్..!

Sharwanand Manamey Second Single : టాలీవుడ్ (Tollywood) అప్ కమింగ్ హీరోల్లో ఒకరైన హీరో శర్వానంద్ (Sharwanand) లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'మనమే' (Manamey). ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీ ను చూపించబోతున్నారు. కామెడీ, ఎమోషన్స్, లవ్ వంటి భావోద్వేగాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మనమే అంటూ సాగిన ఈ పాటను కార్తీక్, గీతా మాధురి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. హేషామ్ అబ్దుల్ వాహాబ్ స్వరపరిచారు. మెలోడీ టచ్ తో ఉన్న ఈ పాట ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ఆసక్తి రేపుతున్న’భజే వాయు వేగం’ ట్రైలర్.. యాక్షన్, ఎమోషన్ తో అదరగొట్టిన కార్తికేయ!

Advertisment
తాజా కథనాలు