Shah Rukh Khan: వెండితెర పై కుమార్తె సుహానాతో షారూఖ్ సందడి.. ఆ పాత్రలో కింగ్ ఖాన్..?

బాలీవుడ్ కింగ్ ఖాన్ త్వరలో తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి వెండి తేరపై కనిపించబోతున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్‌ అప్ కమింగ్ ఫిల్మ్ 'కింగ్'. ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానాతో ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Shah Rukh Khan: వెండితెర పై కుమార్తె సుహానాతో షారూఖ్ సందడి.. ఆ పాత్రలో కింగ్ ఖాన్..?

Shah Rukh Khan Film With his daughter Suhana: బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి త్వరలో వెండితెర పై సందడి చేయబోతున్నారు. దర్శకుడు సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్ నటించనున్న అప్ కమింగ్ మూవీ 'కింగ్' (King). ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స్క్రిప్ట్‌లో మార్పులు

అయితే గతంలో ఈ సినిమాలో షారుక్ ఖాన్.. కూతురు సుహానా ఖాన్‌తో ఓ అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం షారుఖ్ కుమార్తె సుహానాతో ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు మూవీ స్క్రిప్ట్‌ను షారుక్ తన కుమార్తెతో ప్రధాన పాత్రలో కనిపించే విధంగా మార్చినట్లు తెలుస్తోంది.

యాక్షన్ డ్రామాగా

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మూవీలో షారుక్ సుహానా తండ్రి పాత్రలో, సుహానా మెంటర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. సుహానా ఖాన్ ఇటీవల 'ది ఆర్చీస్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సుహానా ఖాన్ 'కింగ్' సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కింగ్ చిత్రం యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు టాక్ .

Also Read: Mirai Movie: సూపర్‌యోధగా తేజ సజ్జ.. ‘మిరాయ్’ గ్లింప్స్ అదిరిపోయింది..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు