YS Sharmila : నేడు వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!

పీసీపీ చీఫ్‌ షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్‌ సమాధి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.

New Update
YS Sharmila : నేడు వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!

Elections :ఏపీ(Andhra Pradesh) లో సార్వత్రిక ఎన్నికలు(General Elections) సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని ప్రముఖ నాయకులందరూ తమ నామినేషన్లను అధికారులకు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీసీపీ చీఫ్‌ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) శనివారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు.

ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్‌ సమాధి వద్దకు భర్త అనిల్‌ కుమార్, వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డితో కలిసి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె భర్త అనిల్‌ కుమార్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిలా తన నామినేషన్‌ పత్రాలను తండ్రి సమాధి పై పెట్టి ప్రార్థించారు.

దగ్గరలో ఉన్న తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ.. కడప(Kadapa) లోక్‌ సభ నామినేషన్‌ పత్రాలు తండ్రి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చినట్లు వివరించారు. కడప ప్రజలకు అన్ని తెలుసని రాజన్న బిడ్డను గెలిపించుకుని తీరుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

''ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరిచి పోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్న. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ.'' అంటూ షర్మిల ట్విటర్ లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం!

Advertisment
తాజా కథనాలు