YS Sharmila: వైఎస్సార్ టీపీ (YSRTP) అద్యక్షురకు వైఎస్ షర్మిల ఈ రోజు రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. తన పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే, కాంగ్రెస్ లో చేరిన షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, తన అన్నయ్య, సీఎం జగన్ కు పోటీగా షర్మిల ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేయనుంది అనే చర్చ జోరందుకుంది. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల క్రీయాశీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: గుడ్ న్యూస్.. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్సులు
ఎంపీ లేదా ఎమ్మెల్యే..
మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను కోరినట్లు తెలుస్తోంది. దీనికి షర్మిల కూడా సరే అందట. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి కడప జిల్లా నుంచి పోటీ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. రాజంపేట ఎంపీ లేదా కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గలు తెలుపుతున్నాయి. వైఎస్‌ఆర్ కుమార్తెగా షర్మిలకు వైఎస్ సన్నిహితుల మద్దతు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో అధికంగా వైఎస్ సన్నిహితులు ఉన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో కడప జిల్లాలోని వైఎస్‌ఆర్ సన్నిహితులు ఆమె వెంట నడిచే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది.
రాహుల్‌ని ప్రధానిగా..
ఈ రోజు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు నుంచి వైఎస్సార్ టీపీ కాంగ్రెస్‌లో భాగం అని అన్నారు. వైఎస్‌ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసమే పని చేశారని గుర్తు చేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా అని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం తన తండ్రి వైఎస్సార్ కల అని అన్నారు షర్మిల.