KP Sharma Oli: నేపాల్ ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నకే.పీ శర్మ ఓలీ!

నేపాల్‌లో విశ్వాస పరీక్షలో ప్రధాని ప్రచండ ప్రభుత్వం విఫలం కావటంతో కొత్త ప్రధానిగా కె.పీ శర్మ ఓలీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కె.పీ శర్మ ఓలీ 2020లో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో సొంత పార్టీలోనే విభేదాలు రావటంతో ఆయన రాజీనామా చేశారు.

New Update
KP Sharma Oli: నేపాల్ ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నకే.పీ శర్మ ఓలీ!

Nepal Prime Minister: నేపాల్‌లో నవంబర్ 2022లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించలేకపోయింది. అందువలన CPN మావోయిస్టు పార్టీ నాయకుడు పుష్ప కమల్ దహల్ ప్రచండ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీతో సహా 4 పార్టీలతో కూటమిగా ఏర్పడి డిసెంబర్ 25, 2022న ప్రధాని గా ప్రచండ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వంపై మార్చి 15న జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించింది.

ఈ సందర్భంలో ఈ నెల 12వతేదీన పార్లమెంటులో మరోసారి విశ్వాస తీర్మానం జరిగింది. మొత్తం 275 మంది సభ్యుల్లో ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 194 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ప్రచండ  ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో విఫలమైవటంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

దీని తర్వాత, నేపాల్‌లో మరో కూటమి మార్పు జరిగింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శర్మ ఓలీ రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.2020లో శర్మ ఓలీ  ప్రధానమంత్రిగా పనిచేశారు. సొంత పార్టీలోనే విభేదాలు రావడంతో ఆయన ఆసమయంలో రాజీనామా చేయాల్సి వచ్చింది.

Also Read: బడ్జెట్ లో క్రిప్టో పై టాక్స్ తగ్గుతుందా? పరిశ్రమ డిమాండ్ ఏమిటి?

Advertisment
తాజా కథనాలు