Investments : షేర్లు.. బంగారం.. FDల వడ్డీలు.. దూసుకుపోతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెటర్? కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. స్టాక్ మార్కెట్ హై లో ఉన్నపుడు, గోల్డ్ రేట్స్ పెరుగుతున్నపుడు ఇన్వెస్టర్స్ వేచి చూసే ధోరణిలోనే ఉండాలనేది నిపుణుల మాట. వివరణాత్మక కథనం కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి By KVD Varma 29 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Markets : స్టాక్ మర్కెట్స్(Stock Market) దూసుకుపోతున్నాయి.. మరో పక్క బంగారం ధరలు భగ్గు మంటున్నాయి. ఇక ఈ ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీరేట్లు కూడా బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళలో డబ్బును పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఎక్కడ పెట్టాలి అనేది పెద్ద అనుమానం పీడిస్తూ ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు ప్రతి విషయాన్ని ఆచి తూచి లెక్క వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఇన్వెస్ట్మెంట్(Investments) ఎక్కడ చేస్తే మంచిది అనే విషయంలో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పుడు బంగారం ధరలు, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం బంగారం ధరలు పీక్స్ లో ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 58 వేల రూపాయలకు పైనే ఉంది. అలానే 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు 64 వేల రూపాయల పైన ట్రేడ్ అవుతోంది. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆల్ టైమ్ హై లో సెన్సెక్స్, నిఫ్టీ కదులుతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీరేట్లు కూడా ఈమధ్య కాలంలో చాలా పెరిగాయి. ఎస్బీఐ లో FDల పై వడ్డీ రేట్లు 6 నుంచి 6.75 శాతం వరకూ ఉన్నాయి. దాదాపుగా అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లోనూ ఇలానే ఉన్నాయి. ప్రయివేట్ బ్యాంకుల్లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా ఇన్వెస్ట్మెంట్(Investments) చేయాలి అనుకున్నపుడు అందరూ ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు చూస్తారు. ఎందుకంటే, రాబడి తక్కువ ఉన్నా పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. మన డబ్బు పోతుందనే బాధ లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు. ఇక బంగారం కొని దాచుకోవాలని కూడా చాలామంది భావిస్తారు. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా సులువైన పెట్టుబడి సాధనం బంగారం. ఎందుకంటే, బంగారం కొనడానికి అమ్మడానికి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే, బంగారంలో ఇన్వెస్ట్ చేయాలంటే దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫలితాన్నిస్తుంది. ఇక స్టాక్ మర్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా రిస్క్ తో కూడుకున్నవి. కానీ, ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫిక్స్డ్ డిపాజిట్స్, బంగారం, స్టాక్స్ మధ్య సాధారణంగా ఉండే విషయాలు. ఇప్పుడు మార్కెట్స్ హై లో ఉన్నపుడు స్టాక్స్ లో ఇన్వెస్ట్(Investments) చేయాలా? బంగారంలో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్న వస్తే కనుక బంగారమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, మార్కెట్ బుల్లిష్ గా ఉన్నపుడు ఇన్వెస్ట్ చేస్తే.. అది చాలా రిస్క్ అని అంటున్నారు. సాధారణంగా బుల్లిష్ మార్కెట్ అనేది తాత్కాలికం. అకస్మాత్తుగా అది బేరిష్ గా మారొచ్చు. అప్పుడు పరిస్థితి తల్లకిందులు అయిపోతుంది. బంగారం విషయంలో అలా కాదు.. ఈ ఏడాది మొత్తంగా చూసుకుంటే, బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్థిరంగా ధరలు ఉండకపోయినా.. ప్రతి ఏటా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలన్నా.. స్టాక్స్ లో ఇన్వెస్ట్(Investments) చేయాలన్నా దీర్ఘకాలిక దృక్ఫధంతోనే ఇన్వెస్ట్ చేయాలనేది నిపుణుల సూచన. ఏడాది లేదా అంతకంటే తక్కువ ప్రాతిపాదికన చేసే ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా రాబడులు ఇచ్చే అవకాశం ఉండదు. రిస్క్ ఎక్కువ తీసుకోవడానికి సిద్ధమయ్యే ఇన్వెస్టర్లు మాత్రమే స్వల్పకాలిక పెట్టుబడులుగా బంగారాన్ని, షేర్లను ఎంచుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్స్(Investments) అనేవి సాధారణంగా రిస్క్ లేనివి అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే, ఎప్పుడైనా అవసరం పడి మధ్యలోనే డబ్బు వెనక్కి తీసుకోవాలి అంటే.. నష్టపోయే అవకాశం ఉంటుంది. Also Read: బాబోయ్ బంగారం.. షాక్ మామూలుగా లేదు.. ఎంత పెరిగిందంటే.. అయితే, ఇన్వెస్టర్స్ కి నిపుణులు చెప్పే ఎప్పుడూ చెప్పే సలహా ఏమిటంటే.. వైవిధ్యభరితంగా పెట్టుబడులు పెట్టాలి అని. అంటే మీ దగ్గర పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నపుడు దానిని ఒకే చోట ఇన్వెస్ట్ చేయకుండా.. కొంత భాగం FDలోనూ.. కొంత భాగం గోల్డ్ లోనూ.. మరి కొంత భాగం స్టాక్స్ లోనూ ఇన్వెస్ట్ చేయడం మంచిది. పెట్టుబడులలో వైవిధ్యం రిస్క్ ను తగ్గిస్తుంది. అలానే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఒకే స్టాక్ లో కాకుండా మీ వీలును బట్టి రెండుమూడు స్టాక్స్ పై ఇన్వెస్ట్(Investments) చేయడం మంచిది అని సూచిస్తారు నిపుణులు. మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుత పరిస్థితిలో ఇన్వెస్ట్(Investments) చేయాలంటే స్టాక్స్ లేదా గోల్డ్ కాస్త గందరగోళంగానే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల వేచి చూడడం మంచిది అని సలహా ఇస్తున్నారు. గమనిక: ఈ ఆర్టికల్ ఈరకంగానే ఇన్వెస్ట్ చేయాలని కానీ.. పెట్టుబడి ఇక్కడే పెట్టాలి అని కానీ సూచించడం లేదు. వివిధ జర్నల్స్, ఫైనాన్షియల వెబ్సైట్స్, ఆర్థిక నిపుణులు వివిధ సందర్భాల్లో విలువరించిన అభిప్రాయాల ఆధారంగా ఇన్వెస్టర్స్ ప్రాథమిక అవగాహన కోసం దీనిని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నపుడు మీ ఆర్థిక సలహాదారుల సూచనలు తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నాం. Watch this interesting Video : #gold-investment #investment #stock-market మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి