Hindu Population Down: భారత్‌లో హిందువుల జనాభా తగ్గింది.. ముస్లింల జనాభా పెరిగింది.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు

భారత్‌లో హిందూ జనాభా వాటా 1950 నుండి 2015 వరకు 7.82 శాతం తగ్గిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. అలాగే దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్లు పేర్కొంది.

Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు
New Update

Hindu Population Down: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) ఇటీవల 1950 నుండి 2015 వరకు వివిధ దేశాలలో మతపరమైన జనాభా మార్పులను విశ్లేషించిన ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ఎక్రోస్- కంట్రీ ఎనాలిసిస్ (Share of religious minorities: A cross-country analysis) అనే పేరుతో అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలను వెల్లడించింది.

పరిశోధనల ప్రకారం, భారతదేశంలోని హిందూ మెజారిటీ జనాభా 65 సంవత్సరాల కాలంలో 7.81 శాతం క్షీణతను చవిచూసిందని పేర్కొంది. మరోవైపు ఇదే సమయంలో ఉహించని విధంగా ఇండియాలో మైనారిటీలుగా ఉన్న ముస్లిం జనాభా పెరిగినట్లు తెలిపింది. గత 65 ఏళ్ల వ్యవధిలో భారత్ లో ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్లు పేర్కొంది.

ALSO READ: లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోంది.. రష్యా సంచలన ఆరోపణలు

నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. 1950లో మెజారిటీ మత వర్గాల వాటా ప్రపంచ సగటు 75% ఉందని పేర్కొంది. 2015 నాటికి, ఈ సంఖ్య సుమారుగా 22% తగ్గిందని తెలిపింది. ఇది గొప్ప మతపరమైన భిన్నత్వం వైపు ప్రపంచ ధోరణిని సూచిస్తుందని హెచ్చరించింది. అధ్యయనం ముఖ్యమైన ప్రాంతీయ వ్యత్యాసాలను హైలైట్ చేస్తుంది. ఉదాహరణకు, అతిపెద్ద జనాభా మార్పులతో సగానికి పైగా దేశాలు ఆఫ్రికాలో ఉన్నాయని.. ఇక్కడ యానిమిస్ట్ మెజారిటీల నుండి ఇతర మతపరమైన తెగలకు మారడం సర్వసాధారణం అని నివేదికలో వెల్లడించింది.

మెజారిటీ హిందూ జనాభా వాటా 1950 నుండి 2015 వరకు 7.82 శాతం తగ్గిందని పేర్కొంది. 84.68 శాతం నుండి 78.06 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. అదే సమయంలో, భారతదేశంలో ముస్లిం జనాభా 1950లో 9.84 శాతం నుండి 2015లో 14.09 శాతానికి పెరిగింది, వారి నిష్పత్తిలో 43.15 శాతం పెరుగుదల ఉందని వివరించింది.

#hindu-population-down #eac-pm-report
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe