Sharannavaratra Festivals: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత

తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామ్మను ఎంతో భక్తితో స్మరించే శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులు అమ్మవారు వివిధ అవతారాల్లో వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు.

Sharannavaratra Festivals: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత
New Update

దసరా శరన్నవరాత్రి(9Sharannavaratra) ఉత్సవాలలో భాగంగా వాసవి మాత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏడాది దసరా ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వాసవి మాత (Vasavi Mata) దేవాలయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు కేరళలోని పల్లెపట్టు కళాకారుల ఆధ్వర్యంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవి (Bala Tripura Sundari Devi)గా అలంకరించి ప్రత్యేక పూజలను(Special Pujas) నిర్వహించారు.

ఇది కూడా చదవండి: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, “ఏపీ క్విట్ జగన్ ” నినాదం ఊపందుకుంది

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు గోపాల్ జగదీష్ (Gopal Jagdish) మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సంపాదించిన కొంత భాగంలో ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించాలని సంఘం ఏర్పాటు సమయంలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలను వాసవి మాత దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది సరికొత్తగా అమ్మవారి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: సీఎంగా కేసీఆర్‌నే ఆశీర్వదిస్తారు: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

గుంతకల్లు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవీ ఆలయంలో శరన్నరరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వర్షాలు పడి ప్రజలందరికి మంచి జరగాలని  ఆర్యవైశ్యులు (Arya Vaishyas) ధార్మిక కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. భక్తులందలరూ అమ్మవారిని దర్శించుకోని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో డబుల్ మర్డర్ కలకలం.. అన్నా చెల్లెళ్లను చంపి ఏం చేశాడంటే..!!

#anathapuram #festivals #gunthakal #vasavi-mata #bala-tripura-sundari-devi #alankaram #sharannavaratra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe