సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ ఎస్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు గతంలో రెండు సార్లు వచ్చిందని ఆయన అన్నారు. కానీ ఆ రెండు సందర్బాల్లో ఆయన ఆ అవకాశాన్ని మిస్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు పవార్ కు వయస్సు మీదపడిందన్నారు. అందుకే పవార్ రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలని సూచించారు.
ప్రధాన మంత్రి అయ్యే అవకాశం శరద్ పవార్ కు రెండు సార్లు వచ్చినా ఆయన దాన్ని వినియోగించుకోలేకపోయాడని అన్నారు. పవార్ ఒక తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలకు ఆయన సేవ చేయగలడని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనకు వయస్పు మీద పడినందున ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
also read: మోడీపై 80 శాతం మందికి పాజిటివ్ కార్నర్ … పీఈడబ్ల్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు…!
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటి వరకు పలు కీలక పదవులను నిర్వహించారు. ఇటీవల ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. పార్టీని రెండుగా చీల్చి ఏక్ నాథ్ షిండే- బీజేపీ సర్కార్ లో చేరారు. ప్రస్తుతం అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా శరద్ పవార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
also read: అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ… బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ….!
సైరస్ పూనావాలా, శరద్ పవార్ లు చాలా కాలంగా మంచి స్నేహితులు. సైరస్ పూనావాలకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు ప్రపంచంలోనే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే కంపెనీగా వుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ పై ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. ఇది అంతరిక్ష రంగంలో భారత్ కు అతి పెద్ద విజయమని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.