ISRO exam: శంకర్ దాదా స్టైల్‌ కాపీ.. ఇస్రో పరీక్ష రద్దు.. చీటింగ్‌ వెనుక కోచింగ్ సెంటర్లు?

టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మన్-బీ, రేడియోగ్రాఫర్-ఏ పోస్టుల కోసం ఇస్రో నిర్వహించిన ఎగ్జామ్‌ క్యాన్సిల్‌ అయ్యింది. శంకర్ దాదా MBBS సినిమాలోలాగా పరీక్షకు ఒకరి బదులు మరొకరు వచ్చినట్టు తేలింది. హర్యానాకి చెందిన అభ్యర్థులు ఈ తరహా చీటింగ్‌ చేయడంతో పరీక్షను రద్దు చేశారు.

ISRO exam: శంకర్ దాదా స్టైల్‌ కాపీ.. ఇస్రో పరీక్ష రద్దు.. చీటింగ్‌ వెనుక కోచింగ్ సెంటర్లు?
New Update

ISRO Exam Cancelled: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) సాంకేతిక సిబ్బందిని నియమించుకోవడానికి నిర్వహించిన పరీక్షను సంస్థ రద్దు చేసింది. హర్యానాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు పరీక్షలో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డారు. చీటింగ్‌ చేశారు. తిరువనంతపురంలోని వివిధ కేంద్రాలలో జరిగిన టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మన్-బీ, రేడియోగ్రాఫర్-ఏ పోస్టులకు రాత(written) పరీక్షలను రద్దు చేసినట్లు VSSC నోటిఫికేషన్‌లో తెలిపింది. "పరీక్ష కోసం సవరించిన షెడ్యూల్‌ను నిర్ణీత సమయంలో అభ్యర్థులందరికీ VSSC వెబ్‌సైట్ ద్వారా క్లారిటీ ఇస్తాం.." అని ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో మోసం చేసిన ఇద్దరు అభ్యర్థులను కేరళ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.



అసలేం జరిగింది?

టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్, రేడియోగ్రాఫర్ పోస్టుల కోసం ఇస్రో (ISRO) గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్ అర్హతతోనే ఈ పరీక్ష జరిగింది. అప్లై చేసిన వారు పరీక్ష సెంటర్‌కి వచ్చారు. వారి గుర్తింపులను తనిఖీ చేసినప్పుడు, పరీక్షకు హాజరయ్యే వారితో వారి పేర్లు సరిపోలలేదు. దీంతో అసలు అభ్యర్థుల కోసం ప్రాక్సీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు హర్యానాకు చెందిన మరో నలుగురు చీటింగ్‌ చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు, పరీక్షను రద్దు చేయాలని VSSCని కూడా కోరడంతో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అందుకు అంగీకరించింది.



కోచింగ్‌ సెంటర్ల హస్తం?

ఇటివలి జరుగుతున్న అనేక ఎగ్జామ్‌ స్కామ్స్‌ వెనుక కోచింగ్‌ సెంటర్లు ఉంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇదే దుస్థితి దాపరించింది. సెంట్రల్‌ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల వరకు కోచింగ్‌ సెంటర్లు పాపులారీటి కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. తమ కోచింగ్ సెంటర్‌ నుంచి ఇంత మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని పబ్లిసిటీ చేసుకోవడం ఇలా చీటింగ్‌ చేస్తున్నాయి. VSSC ఎగ్జామ్‌ విషయంలోనూ ఇదే జరిగినట్టు సమాచారం. హర్యానా నుంచి 400 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దీని వెనుక కోచింగ్ సెంటర్లు ప్రమేయం ఉందా అనే అనుమానాలు నెలకొన్నాయి. రాష్ట్ర పోలీసులతో పాటు దర్యాప్తు బృందాల కూడా ఈ విషయంపై సిరీయస్‌గా ఉన్నాయి. అరెస్టు చేసిన వారిపై సెక్షన్ 406, సెక్షన్ 420, ఇండియన్ పీనల్ కోడ్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని అనేక ఇతర నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ‘మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి భయ్యా’.. ఆర్ట్స్‌ ఫీల్డ్‌లోని ఈ జాబ్స్‌పై ఓ లుక్కేయండి!

#isro-jobs #isro-recruitment-exam-scam #isro-vssc-exam-cancelled #isro-recruitment-test-cancelled #iso-exams #isro-exam-cancelled
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe