Israel Hamas War: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !!

హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి సేఫ్ ఉన్నట్లు ఆమె తల్లి తెలిపారు. మ్యూజిక్‌ఫెస్ట్ నుంచి యువతిని బంధించి తీసుకెళ్లిన హమాస్ ఉగ్రవాదులు..ఆమెను పికప్ ట్రక్‌పై నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యువతి చనిపోయిందని వార్తలు వినిపించాయి. కాగా, తన కుమార్తె బతికే ఉందని తల్లి రికార్డా పేర్కొంది. తన కూతురు షానీ తలకు తీవగ్రాయంతో బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని, తన కుమార్తెను రక్షించాలని జర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

New Update
Israel Hamas War: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !!

Shani Louk - Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులు బందీగా చేసుకుని నగ్నంగా ఊరేగించిన 22 ఏళ్ల జర్మన్ యువతి షానీ లౌక్ (Shani Louk) సజీవంగా ఉన్నట్టు ఆమె తల్లి తెలిపారు. తన కుమార్తె బతికే ఉందని పాలస్తీనా వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని రికార్డా లౌక్ వెల్లడించారు. కుమార్తె భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె షానీని క్షేమంగా రప్పించే ఏర్పాట్లు చేయాలని జర్మనీ (Germany) ప్రభుత్వాన్ని కోరారు. తన కుమార్తె బతికే ఉందని పేర్కొన్న రికార్డా.. తలకు తీవగ్రాయంతో షానీ బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని పేర్కొన్నారు. కాబట్టి త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని ఓ వీడియోలో జర్మనీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇప్పుడు అధికార పరిధికి సంబంధించి వాదనలు అనవసరమని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ (Israel)పై పాలస్తీనా హమాస్ (Hamas) తీవ్రవాదులు టాటూ ఆర్టిస్ట్ అయిన షానీని శనివారం హమాస్ ఫైటర్లు అపహరించారు. గాజా (Gaza) స్ట్రిప్‌కు సమీపంలోని ఉరిమ్‌లో నెగెవ్ ఎడారి మైదానంలో జరుగుతున్న ట్రైబ్ ఆఫ్ సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్ట్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమెను బంధించి పికప్ ట్రక్ వెనక నించోబెట్టి నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారిపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు.

షానీ లౌక్ జర్మనీలోని ఓ టాటూ ఆర్టిస్ట్ (German tattoo artist Shani Louk) . ఆమె శరీరంపై ఉన్న టాటూలను బట్టీ.. సోషల్ మీడియా యూజర్లు ఆమెను షనీ లౌక్‌గా గుర్తించారు. షనీ లౌక్ సోషల్ మీడియాలో ఫేమస్. ట్రక్కు మీద ఉన్న ఫోటోల్లో కూడా అవే టాటూలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. షనీ తల్లి కూడా ఈ విషయంపై స్పందించారు. తన 30 ఏళ్ల కూతురు.. ఓ పర్యాటక బృందంతో ఇజ్రాయెల్ వెళ్లిందని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో తన కూతురు నగ్న వీడియోని చూసిన ఆమె… చనిపోయింది తన కూతురు లాగానే ఉందని తెలిపారు. మరింత సమాచారం కావాలనీ, హెల్ప్ చెయ్యాలని కోరారు. షనీ తల్లి వీడియో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ఇక షనీ కజిన్ టొమాసినా కూడా ఆ నగ్న వీడియోలో ఉన్నది షనీయే అని తెలిపారు.

ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. వైమానిక దాడులతో పాలస్తీనా (Palestine)  గ్రూప్ హమాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్.. మిలటరీ దాడులను ఉద్ధృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు, యుద్ధం కోసం రిజర్వు దళాలకు చెందిన మరింతమందిని పిలిపించింది. గాజాలో ప్రతీకార వైమానిక దాడులతో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. గాజా సరిహద్దులోని దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ఆ ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాలతోపాటు రోడ్లను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని సైన్యం ప్రకటించింది.

Also Read: ముప్పేట గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్..దాడులు తీవ్రతరం

Advertisment
Advertisment
తాజా కథనాలు