Israel Vs Palestine: పాపం పసివాళ్లు.. మంచినీళ్లు లేక చనిపోయే పరిస్థితులు..!
హమాస్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా గాజాకు ఇజ్రాయెల్ ప్రధాన సరఫరాలన్ని నిలిపివేసింది. అందులో నీరు కూడా ఉండడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంచినీరు కోసం చిన్నారులు బారుల తీరిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. గాజా జనాభాలో 47శాతం మంది 17ఏళ్ల లోపు వారే ఉండడం..వారందరికి ఇప్పుడు తాగడానికి నీళ్లు లేకపోవడం కలవరపెడుతోంది