Shamshabad Airport: సరికొత్త రికార్డ్ నెలకొల్పిన శంషాబాద్ విమానాశ్రయం.. ఒకే నెలలో 2.3 మిలియన్ల..

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక మే నెలలోనే అత్యధికంగా 2.3 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. మే4న 548 విమానాల రాకపోకలు జరిగినట్లు GMR AIL వెల్లడించింది.

New Update
Shamshabad Airport: సరికొత్త రికార్డ్ నెలకొల్పిన శంషాబాద్ విమానాశ్రయం.. ఒకే నెలలో 2.3 మిలియన్ల..

Hyderabad: తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే నెలలో అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. ఈ మేరకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మే నెలలోనే 2.3 మిలియన్ల మంది ప్రయాణికులు ఇక్కడినుంచి జర్నీ చేసినట్లు తెలిపింది. 2023తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణీకుల రద్దీ 11 శాతం పెరిగిందని, మే 18, 2024న ఈ ఎయిర్‌పోర్టు నుంచి 82,300 మంది ప్రయాణికులు వెళ్లినట్లు తెలిపింది. ఇక దేశీయ ట్రాఫిక్ 10, అంతర్జాతీయ ట్రాఫిక్ 14 శాతం పెరిగినట్లు చెప్పింది. మే 4న అత్యధికంగా 548 విమానాల రాకపోకలు జరిగినట్లు వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు