టైమ్ అంటే టైమే...శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో ఘనత

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో ఘనత దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా పర్ఫెక్ట్ టైమ్‌ని పాటించే ఎయిర్ పోర్టులలో శంషాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఫ్లైట్‌లు టైమ్‌కు ల్యాండ్ అవడం, అలాగే బయలు దేరడంలో కచ్చితమైన టైమ్ పాటిస్తోందిట మన ఎయిర్ పోర్ట్.

టైమ్ అంటే టైమే...శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో ఘనత
New Update

Shamshabad Airport:శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాలన్నింటినీ వెనక్కి నెట్టేసి మరీ టాప్ సెకండ్‌లో గర్వంగా నిల్చుంది. సమయ పాలనలో మన ఎయిర్ పోర్ట్‌కు మించినది లేదని చెబుతున్నాయి నివేదికలు. ప్రఖ్యాత ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ అయిన సీరియమ్ ద్వారా ఆన్- టైమ్ పని తీరు కోసం చేసిన సర్వేలో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా రెండవ అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంక్ సాధించింది. సీరియమ్ విడుదల చేసిన నివేదికలో 84. 42 శాతం ఓటీపీతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని విమానాశ్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్‌లు అలాగే పెద్ద విమానాశ్రయాల వారీగా చూస్తే రెండింటిలోనూ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ 2వ స్థానంలో నిలిచింది.

Also read:కిలాడీ లేడీ సయీదాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు అత్యత్తుమ అనుభవాన్ని అందించడంలో ముందుంది అని చెబుతున్నాయి సీరియమ్ నివేదికలు. విమానాలు బయలుదేరడం, ల్యాండింగ్ విషయంలో కరెక్ట్ టైమ్ పాటిస్తోందని అంటున్నాయి. ఇక న్యూ ఇయర్ వేళ ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్ పోర్టు గుడ్ న్యూస్ వినిపించింది. ఫ్లైట్ టైం కంటే గంటల ముందే వచ్చి వెయిట్ చేయటం.. బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాసుల కోసం క్యూలైన్లలో నిలబడటం లాంటి ఇబ్బందులకు స్వస్తి చెప్తూ.. కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. న్యూఇయర్ సందర్భంగా.. సిటీసైడ్‌ సెల్ఫ్‌ చెక్ఇన్‌ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఈ విధానంలో.. ఎయిర్ పోర్టులోని కారు పార్కింగ్‌ ప్రాంతం నుంచే ప్రయాణికులు వారి బోర్డింగ్‌పాస్‌లు, లగేజ్ పాస్‌లను పొందొచ్చు.

#hyderabad #shamshabad #gmr-international-airport
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe