Shampoo Bath: షాంపూ వాడితే లివర్ డ్యామేజీ అవుతుందా? జుట్టు ఒత్తుగా పెరగడానికి కెమికల్ ప్రొడెక్ట్స్‌ని వాడుతూ ఉంటాం. కానీ కెమికల్స్ వాడితే జుట్టుకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. పాతకాలం పద్ధతులను అనుసరిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కేర్ తీసుకుంటే జుట్టుకు ఎంతోమంచిదని సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 20 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Shampoo Bath: జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, ఒత్తుగా, సిల్కీగా పెరగడానికి ఎన్నో బ్రాండెడ్ ఉత్పత్తులను వాడుతుంటారు. షాంపూతో సహా జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయనిచ, షాంపూల వాడకం ప్రాణాంతకం అవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో సౌందర్య పరిశ్రమ ఒకటి, ప్రతి సంవత్సరం 6% వృద్ధి చెందుతోంది. వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, రోజురోజుకు మరిన్ని బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అలాగే జుట్టు సంరక్షణ కోసం వివిధ ఉత్పత్తులు వాడేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే తాజాగా సైంటిస్టుల అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కెమికల్స్ వలన జుట్టుకు ప్రమాదమా?: మార్కెట్‌లో లభించే చాలా షాంపూలు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ జుట్టును పాడుచేస్తాయని, వాటిలోని రసాయనాల వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ జర్నల్‌లో కథనం ప్రకారం జుట్టు సంరక్షణ ఉత్పత్తులలోని రసాయనాలు మన జుట్టులో ఎక్కువ కాలం ఉంటాయి. దీని వాసన పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థపై అధిక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాలేయం దెబ్బతింటుందా?: అంతే కాదు కాలేయం దెబ్బతినే అవకాశం కూడా ఎక్కువగా ఉందని తేలింది. ఒక వ్యక్తి ఇంట్లో జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఒక్కసారి ఉపయోగించడం ద్వారా 17 mg హానికరమైన రసాయనాలను పీల్చుకుంటాడని అంటున్నారు. అయితే హెయిర్ జెల్స్, ఆయిల్స్, క్రీములపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని, షాంపూల వంటి జుట్టు సంరక్షణ ఉత్పత్తులలోని రసాయనాలపై ఈ అధ్యయనం జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం రసాయనాలు ఎక్కువగా అధిక వేడి కలిగించే కర్లింగ్ పరికరాలు, హెయిర్ స్ట్రెయిట్నర్స్‌ను వాడటం వల్ల వెలుడుతాయని అంటున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ఉత్పత్తులను ఉపయోగించకపోవడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఎలా బయటపడవచ్చు?: బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఆన్ చేయడం వల్ల షాంపూ చేసేటప్పుడు దాని ప్రభావాన్ని 90 శాతం తగ్గించవచ్చని కూడా అంటున్నారు. ఇది కూడా చదవండి: గర్భాశయంలో సమస్యలు ఉంటే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #shampoo #head-bath #shampoo-side-efects మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి