బంగ్లాదేశ్(Bangladesh) ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) నిత్యం వివాదాల్లో నిలుస్తుంటాడు. దశాబ్దాలుగా నంబర్ -1 ఆల్‌రౌండర్‌గా, ప్రపంచం మెచ్చిన క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న షకీబ్ అటు గొడవల్లోనూ నంబర్ వన్‌గానే ఉంటాడు. అంపైర్లను బూతులు తిడతాడు. వికెట్లు ఎత్తి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతనికి నచ్చినట్టుగా నడుచుకుపోతే సొంత జట్టు ఆటగాళ్లపైనా నోరు పారేసుకుంటాడు. ఇదంతా కాయిన్‌కు రెండో సైడ్ షకీబ్ ఫేస్. మరోసారి తన రెండో ముఖాన్నే ప్రపంచానికి చూపించాడు. ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు.
షార్ట్ టెంపర్ ప్లేయర్:
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ఇటివలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మగురా-1 నియోజకవర్గం అవామీ లీగ్ అభ్యర్థి షకీబ్ అల్ హసన్ ఎన్నికల రోజు గందరగోళంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది. వీడియోలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, వారం రోజుల క్రితం ఈ గొడవ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు మరోసారి షకీబ్ షార్ట్ టెంపర్ గురించి చర్చించుకుంటున్నారు.
వాగ్వాదం.. ఆపై చెంపదెబ్బ:
ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం వద్ద షకీబ్ కు ఊహించని అనుభవం ఎదురైంది. ఓటు వేసేందుకు వచ్చిన ఆయనను వెనుక నుంచి ఓ వ్యక్తి పట్టుకోవడంతో క్రికెట్ స్టార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షణికావేశంలో షకీబ్ సహనం కోల్పోయి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. ఢాకా ట్రిబ్యూన్(Dhaka Tribune) ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన సమయాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. ఇది పోలింగ్ రోజున జరిగిందని కొందరు చెబుతుండగా, వారం రోజుల ముందే జరిగిందని మరికొందరు చెబుతున్నారు. టైమ్ లైన్ చుట్టూ ఉన్న గందరగోళం వివాదం చుట్టూ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. తన రాజకీయ ఆకాంక్షలను ప్రకటించి, జాతీయ ఎన్నికలలో మగురా -2024 నియోజకవర్గానికి అవామీ లీగ్ అభ్యర్థిగా మారినప్పటి నుంచి.. షకీబ్ అల్ హసన్ దేశవ్యాప్తంగా పర్యటించాడు. పౌరులతో మమేకమయ్యాడు. తన ప్రచార ర్యాలీలలో క్రికెట్‌ను కూడా చేర్చాడు.
విజయం:
అటు షకీబ్ అల్ హసన్ ఈ ఎన్నికల్లో గణనీయమైన మెజారిటీతో పార్లమెంటరీ సీటును సాధించాడు. క్రికెట్ కెరీర్‌ను సక్సెస్ చేసుకున్న 36 ఏళ్ల షకీబ్ రాజకీయంగానూ రాణించాలని.. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: పొట్టి ఫార్మెట్‌లోకి బాస్, కింగ్ రీఎంట్రీ.. అఫ్ఘాన్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన!
WATCH: