Jawan Movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇటీవల నటించిన 'జవాన్' మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. దాదాపు రూ.1068 కోట్లకుపైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచి సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమా (ఒరిజినల్ లాంగ్వేజ్)గా కూడా ఘనత సాధించింది. ఈ క్రమంలోనే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రీమియర్ అవుతున్న జవాన్ 10 రోజుల్లోనే 25 మిలియన్ల వాచ్ హవర్స్ తో సరికొత్త చరిత్రను సృష్టించింది.
ఇక ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్‌గా నటించగా లేడీ సూపర్ స్టార్ నయనతార మెయిన్ హీరోయిన్ పాత్ర పోషించింది. బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఇక షారుఖ్ ఖాన్ కు చెందిన రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అతని భార్య గౌరీఖాన్ ఈ సినిమాను (Jawan) నిర్మించగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో మెప్పించారు.
Also Read: అలియా సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన ఫిట్నెస్ కోచ్.. వీడియో వైరల్
ఇదిలావుంటే.. తాజాగా ఓ పార్టీలో దర్శకుడు అట్లీ తన అప్ కమింగ్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దళపతి విజయ్, షారుక్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. 'ప్రస్తుతం ఈ మలీస్ట్టారర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాం. త్వరలోనే ఇది తెరకెక్కే అవకాశాలున్నాయి. విజయ్, షారుక్ ఖాన్ నా సినిమాల గురించి మాట్లాడుకొని నాకు ఫోన్ చేశారు. మల్టీస్టారర్ తీసే ఆలోచన ఉంటే.. అందులో తాను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుక్ చెప్పారు. అలాగే విజయ్ కూడా ఇదే మాట అన్నారు. అందుకే వాళ్లిద్దరితో ఓ మల్టీస్టారర్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇదే నా తదుపరి చిత్రం అవుతుంది. రూ.3000 కోట్లు వసూళ్లు చేసే చిత్రమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే నేను చెప్పలేను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి తొలి కారణం విజయ్.. నాపై నమ్మకంతో అవకాశాలిచ్చారు' అని అట్లీ చెప్పుకొచ్చారు.