Shafali Verma Record: సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన షఫాలీ.. చెన్నై టెస్ట్ లో రికార్డులే రికార్డులు! సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో 205 పరుగులతో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. షెఫాలీ కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి మహిళా టెస్ట్ క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మ్యాచ్ మొదటి రోజు భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. By KVD Varma 29 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Shafali Verma Record: చెన్నైలో సౌతాఫ్రికా మహిళల టీమ్ తో భారత్ మహిళల టీమ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ మొదటిరోజే రికార్డుల మోత మోగించారు టీమిండియా అమ్మాయిలు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన షఫాలీ వర్మ 205 పరుగులు, స్మృతి మందన 149 పరుగులు చేసి టీమ్ ఇండియా మహిళా జట్టు తొలి వికెట్‌కు 292 పరుగులు జోడించారు. సతీష్ శుభ 15 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 55 పరుగులు చేసి ఔటయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్ అజేయంగా 42 పరుగులు, రిచా ఘోష్ అజేయంగా 43 పరుగులు చేశారు. తొలి రోజు భారత్ 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. రికార్డులే రికార్డులు.. Shafali Verma Record: సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో 205 పరుగులతో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఇరవై ఏళ్ల షెఫాలీ కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి ఆస్ట్రేలియా క్రీడాకారిణి అనాబెల్ సదర్లాండ్‌ను అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్లె 248 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. Shafali Verma Record: భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా షఫాలీ నిలిచింది. Shafali Verma Record: మహిళల టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా షఫాలీ వర్మ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో షఫాలీ 8 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆస్ట్రేలియా క్రీడాకారిణి అలిస్సా హీలీ బాదిన 2 సిక్సర్లు ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. Shafali Verma Record: షఫాలీ వర్మ - స్మృతి మంధాన మహిళల టెస్ట్ మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును సృష్టించారు. టీమిండియా ఓపెనింగ్ జోడీ 292 పరుగుల భాగస్వామ్యంతో ఈ ప్రపంచ రికార్డు కొట్టింది. పాక్ ఓపెనింగ్ జోడీ కిరణ్ బలోచ్, సజ్జిదా షా 241 పరుగుల భాగస్వామ్యం ఇప్పటివరకు రికార్డు. Shafali Verma Record: షఫాలీ-స్మృతి జోడీ భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించింది. అంతకుముందు తిరుష్ కామిని, పునమ్ రౌత్ 275 పరుగుల రికార్డునుచేశారు. షఫాలీ వర్మ, స్మృతి మంధాన 292 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. Also Read: చోకర్స్ వర్సెస్ చోకర్స్.. ఎవరు ఓడినా గోలే..! #cricket #women-cricket #shafali-verma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి