Shafali Verma Record: సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన షఫాలీ.. చెన్నై టెస్ట్ లో రికార్డులే రికార్డులు!
సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో 205 పరుగులతో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. షెఫాలీ కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి మహిళా టెస్ట్ క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మ్యాచ్ మొదటి రోజు భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది.