Girls Missing case: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్యూషన్ కు వెళ్లిన బాలికలను కామాంధులు వెంటపడి వేధించడంతో గూడ్స్‌రైలు ఎక్కి ఏకంగా 140 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన సంచలన రేపింది. అయితే ఆ బాలికలను ట్రెయిన్ గార్డు రవినీత్ ఆర్య కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..
ఈ మేరకు యూపీలోని హాథ్రాస్‌కు చెందిన బాలికలు రాత్రిపూట ట్యూషను నుంచి ఇంటికి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసిన వారిద్దరూ.. దారిలోని రైల్వేస్టేషనులో ఆగి ఉన్న గూడ్సు రైలు ఎక్కేశారు. ఇంతలోనే రైలు కదిలిపోవడంతో ఏమీ చేయలేక 140 కి.మీ.లు రైలు ప్రయాణించింది. తమ దగ్గరున్న సెల్‌ఫోనుతో ఇంట్లోవాళ్లకు సమాచారం అందించారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం చెప్పలేకపోయారు. చివరికి హాథ్రాస్ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11.00 గంటలకు ఇటావాలో ఆగింది. ఈ క్రమంఓలనే సంతకం చేసేందుకు స్టేషనులోకి వెళ్లిన ఆర్య ప్లాట్‌ఫాం మీద కూర్చొని భయంభయంగా దిక్కులు చూస్తున్న ఇద్దరు బాలికలను గమనించారు. బాలికలు కన్నీటిపర్యంతం అవుతూ జరిగిన విషయాన్ని ఆమెకు వివరించారు. ఆర్య స్టేషను సూపరింటెండెంటు దృష్టికి తీసుకెళ్లి బాలికలను సురక్షితంగా ఇంటికి చేర్చారు. పోలీసు అధికారులు ఆర్యను అభినందించారు.