Karnataka: బ్యాగులో 72 అరుదైన జాతి పాములు, ఆరు చనిపోయిన కోతులు!

విమానాశ్రయంలో నిందితుడు అనుమానస్పదంగా ఉండటంతో అతనిని తనిఖీ చేయగా నిందితుడి బ్యాగులో 72 అరుదైన పాములతో పాటు చనిపోయిన ఆరు కోతులను కూడా అధికారులు గుర్తించారు.

New Update
Karnataka: బ్యాగులో 72 అరుదైన జాతి పాములు, ఆరు చనిపోయిన కోతులు!

కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని విమానాశ్రయాధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయంలో నిందితుడు అనుమానస్పదంగా ఉండటంతో అతనిని తనిఖీ చేయగా నిందితుడి బ్యాగులో 72 అరుదైన పాములతో పాటు చనిపోయిన ఆరు కోతులను కూడా అధికారులు గుర్తించారు.

చనిపోయిన కోతులను తగు జాగ్రత్తలు తీసుకుని డిస్పోజ్ చేశారు. పాములను వాటి ఆవాస దేశాలకు పంపించారు. నిందితుడు బ్యాంకాక్‌ నుంచి ఎయిర్ ఏషియా విమానంలో బెంగళూరుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ఆ వన్య ప్రాణులన్నిటిని కూడా అక్రమంగా దేశంలోనికి తీసుకుని వచ్చినట్లు అధికారులు వివరించారు.

72 పాములు కూడా అరుదైన జాతికి చెందినవని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. వాటిలో 55 బాల్ పైథాన్‌లు, 17 కింగ్‌ కోబ్రాలు ఉన్నాయని తెలిపారు. అయితే బ్యాంకాక్‌ నుంచి ఆరు అరుదైన జాతికి చెందిన కోతులను తీసుకుని వచ్చే క్రమంలో అవి చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి మీద వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు