Appetite: ఆకలిగా అనిపించడం లేదా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే!

సరైన ఆకలి మన ఆరోగ్యంగా ఉన్నామని తెలిపే సూచన. కొంత మంది తరచుగా ఆకలి లేదని చెప్తుంటారు. అది అనారోగ్యానికి సంకేతం. ఆకలి లేకపోవడానికి గల అనారోగ్య కారణాలు ఇవే. జీర్ణక్రియ సమస్యల, థైరాయిడ్, ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు ఆకలిని తగ్గిస్తాయి.

Appetite: ఆకలిగా అనిపించడం లేదా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే!
New Update

రోజూ సమయానికి ఆకలి, నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుపుతుంది. చాలా మంది ఆకలిగా లేదనే సమస్యను సింపుల్ గా తీసుకుంటారు. కానీ ఈ సమస్య పై శ్రద్ధ పెట్టల్సిన అవసరం ఉంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఆకలి లేకపోవడం కారణం. ఎప్పుడైనా ఒకసారి ఆకలి లేకపోవడం సహజం. కానీ రోజుల కొద్ది ఈ సమస్య కొనగగితే మీలో ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే

ఆకలి లేకపోవడానికి ఈ ఆరోగ్య సమస్యలు సంకేతం.

జీర్ణక్రియ సమస్యలు

జీర్ణక్రియ సమస్యలు ఆకలి తగ్గిపోవడానికి కారణం. ప్రేగు వ్యాధి, కడుపులో పుండ్లు, పెప్టిక్ అల్సర్స్, జీర్ణక్రియ వాహికను అనారోగ్యానికి గురి చేస్తాయి. దీని వల్ల కడుపులో నొప్పి, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ సమస్యలు

హైపోథైరాయిడిజం ఆకలి తగ్గడానికి కారణమవుతుంది. జీవక్రియను నిర్వహించడంలో థైరాయిడ్ గ్రంథిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో మార్పులు వచ్చినప్పుడు ఆకలిని తగ్గించును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండింటికీ దగ్గర సంబంధం ఉంటుంది. నిరాశ, ఒత్తిడి, ఆందోళన, వంటి మానసిక సమస్యలు శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. మానసిక సమస్యలు తీవ్రమైనప్పుడు ఆకలి తగ్గిపోవడం, తిండి పై శ్రద్ధ చూపలేకపోతారు.

దీర్ఘకాల ఇన్ఫెక్షన్స్

HIV, AIDS, క్షయవ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఆకలి కోల్పోవడానికి కారణమవుతాయి. ఈ ఇన్ఫెక్షన్స్ శరీర రోగనిరోధక శక్తి పై ప్రభావం చూపుతాయి. దీని వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఆకలిని తగ్గించే ప్రమాదం ఉంటుంది.

Also Read: తెలుగు కుర్రాడికి షాక్‌.. మూడో వన్డే నుంచి ఔట్.. తుది జట్టు ఇదే!

#health-tips #life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe