Bigg Boss 8 : 'బిగ్ బాస్' 8 లోకి బుల్లితెర హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. సీజన్ 8 లో సీరియల్ ఆర్టిస్టులు అంజలి, పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. వీళ్ళతో పాటూ మరో సీరియల్ నటి జ్యోతి రాయ్ సైతం బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
Bigg Boss 8 : 'బిగ్ బాస్' 8 లోకి బుల్లితెర హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?

Serial Actress Jyothi Rai : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ సీజ‌న్ 7 అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని పెద్ద స‌క్సెస్‌ కావడంతో.. సీజన్ 8 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో సీజన్ 8 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిలో ముఖ్యంగా రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి,పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ, కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ పేర్లు వినిపిస్తున్నాయి.

Also Read : హరీష్ శంకర్ కనిపిస్తే కొడతాం అంటున్న రవితేజ ఫ్యాన్స్.. వీడియో వైరల్

అయితే వీళ్ళతో పాటు ప్రముఖ సీరియల్ నటి జ్యోతి రాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్ లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిట్టి పొట్టి డ్రెస్ లతో రచ్చ చేసే ఈ అమ్మడు.. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు