Sensex Record: అదే దూకుడు.. ఆల్ టైం హై లో స్టాక్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దాదాపు పది రోజులుగా బుల్లిష్ గా నడుస్తున్న మార్కెట్లు ఈరోజు అంటే(డిసెంబర్ 11) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంట లోపే ఆల్ టైమ్ హైకి అంటే తొలిసారిగా 70వేలు దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 21 వేల స్థాయిని దాటింది By KVD Varma 11 Dec 2023 in బిజినెస్ క్రైం New Update షేర్ చేయండి Sensex Record: ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత వారాంతంలో ఆల్ టైమ్ హైలో ముగిసిన సెన్సెక్స్.. ఈ వారం ప్రారంభంలో మరింత దూకుడుగా ప్రారంభం అయింది. స్టాక్ మార్కెట్ మళ్లీ ఈ రోజు అంటే సోమవారం (డిసెంబర్ 11) సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ తొలిసారిగా 70 వేలు దాటి 70,048 స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 21,019 స్థాయిని తాకింది. అంతకుముందు శుక్రవారం (డిసెంబర్ 8) కూడా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ఈరోజు సెన్సెక్స్(Sensex Record) 100 పాయింట్ల లాభంతో 69,925 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీలో కూడా 82 పాయింట్లు పెరిగి 20,965 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 17 పెరగడం - 13 క్షీణించడం కనిపించింది. Also Read: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల సెన్సెక్స్ ప్రస్థానం ఇదీ.. జూలై 25, 1990న బీఎస్ఈ సెన్సెక్స్(Sensex Record) తొలిసారిగా 1 వేల స్థాయిని తాకింది. 1 వేల నుండి 10 వేలకు చేరుకోవడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది (6 ఫిబ్రవరి 2006). కానీ 10 వేల నుంచి 70 వేల వరకు ప్రయాణం కేవలం 17 ఏళ్లలోనే పూర్తయింది. 24 సెప్టెంబర్ 2021న BSE 60 వేల స్థాయిని తాకింది స్థాయి చేరుకున్న తేదీ 1,000 25 జూలై 1990 10,000 6 ఫిబ్రవరి 2006 20,000 29 అక్టోబర్ 2007 30,000 4 మార్చి 2015 40,000 23 మే 2019 50,000 21 జనవరి 2021 60,000 24 సెప్టెంబర్ 2021 70,000 11 డిసెంబర్ 2023 గ్లోబల్ మార్కెట్ల బలంతో.. గ్లోబల్ మార్కెట్ల నుంచి మంచి సంకేతాలు, ఆసియాలో బలం కనిపిస్తోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. S&P 500 ఇండెక్స్ వరుసగా ఆరవ వారం పెరిగింది. ఇది ఈ సంవత్సరం కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. వరుసగా 6 రోజుల క్షీణత తర్వాత క్రూడ్ కోలుకుంది. ధర 2% కంటే ఎక్కువ పెరిగి దాదాపు $76కి చేరుకుంది. శుక్రవారం ఆల్ టైమ్ హైని నమోదు చేసిన మార్కెట్.. అంతకుముందు శుక్రవారం (డిసెంబర్ 8) స్టాక్ మార్కెట్(Sensex Record) ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ 69,893.80 స్థాయిని తాకగా, నిఫ్టీ 21,006.10 స్థాయికి చేరుకుంది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303.91 పాయింట్లు పెరిగి 69,825.60 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 68.25 పాయింట్లు పెరిగి 20,969.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 వృద్ధి చెందగా, 11 క్షీణించాయి. Watch this interesting Video: #stock-market-news #stock-market-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి