కుక్క కరిస్తే ప్రభుత్వానికి రూ.10వేల ఫైన్.. పంజాబ్‌-హరియాణా హైకోర్టు సంచలన తీర్పు

వీధి కుక్కల దాడి కేసులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు మంగళవారం ఆసక్తికరమైన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో కుక్క, ఇతర జంతువులు కరిస్తే ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

కుక్క కరిస్తే ప్రభుత్వానికి రూ.10వేల ఫైన్.. పంజాబ్‌-హరియాణా హైకోర్టు సంచలన తీర్పు
New Update

దేశవ్యాప్తంగా కుక్కల దాడులు మరింత పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో వీధి కుక్కలు పసిపిల్లలపై క్రూరంగా దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు నియంత్రణపై చర్యలు చేపట్టినా పెద్దగా ప్రభావం ఉండట్లేదు. ఏదో ఒక మూలన ప్రజలు శునకాల కాటుకు బలవుతూనే ఉన్నారు. అయితే ఇటీవల మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్‌-హరియాణా హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఆసక్తికర తీర్పు వెలువరించింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం అందించాలని ఆదేశించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

Also read : ‘ధోనీని చూసి నేర్చుకోండి’.. రమీజ్ రాజాకు గడ్డిపెట్టిన పాక్ మాజీ పేసర్

ఈ మేరకు ‘పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది’ అని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో వెలువరించింది. అలాగే క్లెయిమ్‌ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని పేర్కొంది. చివరగా ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు సూచించింది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమను కుక్కల బారినుంచి ప్రభుత్వం కాపాడుతుందని ఆశిస్తున్నారు.

#dog-bites #punjab-haryana-high-court #ten-thousend-fine
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe