TS Opinion Poll 2023: తెలంగాణలో మరో సంచలన సర్వే.. బీఆర్ఎస్ కు తగ్గనున్న సీట్లు.. లెక్కలివే!

తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడింది. దీంతో సర్వేల సందడి షురూ అయ్యింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..ఎంత శాతం ఓటింగ్ నమోదు అవుతుంది.. ఏపార్టీ ది అధికారం..అంటూ సర్వే ఫలితాలు ఊదరగొడుతున్నాయి. అయితే అన్ని సర్వేలు అధికార పార్టీకి జై కొడితే...ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీఆర్ఎస్ కు షాకిచ్చే న్యూస్ వెల్లడించింది. అన్ని సర్వేలు ఇచ్చే ఫలితాలకు భిన్నంగా ఇండియా టీవీ సర్వే మాత్రం బీఆర్ఎస్ కు కాస్త షాకిచ్చే న్యూస్ వెల్లడించింది

New Update
TS Opinion Poll 2023:  తెలంగాణలో మరో సంచలన సర్వే.. బీఆర్ఎస్ కు తగ్గనున్న సీట్లు.. లెక్కలివే!

India TV-CNX Opinion Poll on Telangana Elections 2023:  తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడింది. దీంతో సర్వేల సందడి షురూ అయ్యింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..ఎంత శాతం ఓటింగ్ నమోదు అవుతుంది.. ఏపార్టీ ది అధికారం..అంటూ సర్వే ఫలితాలు ఊదరగొడుతున్నాయి. అయితే అన్ని సర్వేలు అధికార పార్టీకి జై కొడితే...ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీఆర్ఎస్ (BRS) కు షాకిచ్చే న్యూస్ వెల్లడించింది. అన్ని సర్వేలు ఇచ్చే ఫలితాలకు భిన్నంగా ఇండియా టీవీ సర్వే మాత్రం బీఆర్ఎస్ కు కాస్త షాకిచ్చే న్యూస్ వెల్లడించింది

అన్ని సర్వేలకు భిన్నంగా ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ (India TV-CNX)విడుదల చేసిన ఒపీనియన్ పోల్ లో బీఆర్ఎస్ కు లోకసభ సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లను (MP Seats) కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కు ఈసారి మాత్రం ఒక్కటి తగ్గి 8 సీట్లు వస్తాయని పేర్కొంది. అటు కాంగ్రెస్ (Congress Party) గత ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు వస్తే...ఈసారి 1 సీటు మాత్రమే వస్తుందని సర్వే వెల్లడించింది. ఇక బీజేపీకి (BJP) ఈ సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎలక్షన్ లో బీజేపీకు నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి. అందులో సికింద్రాబాద్,నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. ఈ సారి ఏకంగా 6 సీట్లకు గెలుచుకుంటుందని ఇండియా టీవీ సర్వే (Indian Tv Survey) అంటోంది. అంటే అదనంగా 2 సీట్లు వస్తాయంటూ ఆశాజనక ఫలితాలను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఏపీలో జగన్ కు షాకిచ్చిన సర్వే… ఎన్ని సీట్లు తగ్గుతాయంటే?

కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వచ్చేసరికి రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంపీ స్థానాల్లో బీజేపీకి ఆశాజనక సీట్లు వచ్చినప్పటికీ రాష్ట్రానికి వచ్చేసరికి పూర్తిగా విరుద్ధంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. అసెంబ్లీ ఫలితాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని ఎన్నో సర్వేలు చెప్పాయి. బీజేపీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అంటున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పటివరకు రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగితే...బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉండే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ దే ఆధిక్యం అంటుంటే...గత ఎన్నికలతో పోలిచితే బీజేపీకే  2 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడాల్సిందే.

ఇది కూడా చదవండి: చరిత్రలో తొలిసారి…పరేడ్‎కు నాయకత్వం వహిస్తున్న తొలిమహిళగా రికార్డ్..!!

Advertisment
తాజా కథనాలు