AP: స్పీకర్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సంచలన లేఖలు ..!!

New Update
AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ

ఏపీ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ మారాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు. అక్కడితో ఆగకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు అనర్హత వేటు వేయాలని ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు. రాతపూర్వక స్పందన కోసం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు.

వైసీసీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ కు సంచలన లేఖలు రాశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరారు. గత ఏడాది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని..ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వీరిపై వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:  రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్న ఢిల్లీ మహిళా పోలీసు దళం..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు