Shiva Balakrishna Case: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో (Confession Report) సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కస్టడీ కన్ఫెషన్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ (IAS Arvind Kumar) పేరును ప్రస్తావించాడు శివబాలకృష్ణ. ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఒత్తిడి చేయడం వల్ల అక్రమాలు చేసినట్లు తెలిపారు. శివబాలకృష్ణ సాయంతో తమకు కావాల్సిన భవనాల అనుమతులు ఐఏఎస్ అర్వింద్ కుమార్ జారీ చేసుకున్నట్లు వెల్లడించారు. పలు దఫాలుగా నగదు రూపంలో చెలింపులు జరిపినట్లు వెల్లడించారు. ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఇచ్చిన సూచనా మేరకే జనగామ (Janagama), విశాఖలో (Vishaka) భూములు కొనుగోలు చేసినట్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో శివబాలకృష్ణ ఫోన్ ను సీజ్ చేశారు ఏసీబీ (ACB) అధికారులు. ఐఏఎస్ అధికారితో చేసిన చాట్స్, కాల్ రికార్డ్స్ వివరాలను ఏసీబీ అధికారులు వెలికి తీస్తున్నారు.
ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెప్పిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసినట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. కస్టడీలో శివబాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను ఏసీబీ విచారించనుంది. అతన్ని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కోర్టు అనుమతిని ఏసీబీ కోరనుంది.
ALSO READ: "బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కనిపించడం లేదు"
DO WATCH: