UGC: యూజీసీ సంచలన నిర్ణయం.. ఇక ఏటా రెండుసార్లు అడ్మిషన్లు!

విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏటా రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై-ఆగష్టు, జనవరి-ఫిబ్రవరిలో అడ్మిషన్లు ఉంటాయని యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు.

UGC: యూజీసీ సంచలన నిర్ణయం.. ఇక ఏటా రెండుసార్లు అడ్మిషన్లు!
New Update

UGC Admission: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బోర్డ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో యేడాకికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి రెండు దశల్లో జూలై-ఆగష్టు, జనవరి-ఫిబ్రవరి నెలల్లో అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు దేశీయ యూనివర్శిటీల్లో ఏటా రెండుసార్లు అడ్మిషన్లు కల్పించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలుంటాయని బోర్డ్ తెలిపింది. బోర్డు ఫలితాల్లో వివిధ కారణాలతో జూలై-ఆగష్టులో అడ్మిషన్ తీసుకోలేకపోయిన వారికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని, రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృధా కాకుండా ఉంటుందని చెప్పారు. మరోవైపు కంపెనీలు సైతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లను రెండుసార్లు నిర్వహించవచ్చని జగదీష్ తెలిపారు.

రెండుసార్లు అడ్మిషన్ల ద్వారా విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ ఫ్యాకల్టీ, క్లాస్‌రూమ్, ల్యాబ్, ఇతర సౌకర్యాలను మరింత సమర్థవంతంగా కలిగి ఉండొచ్చు. విదేశీ యూనివర్శీటీల్లో ఈ విధానం ఇప్పటినే ఉన్నందున అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీలు ఈ విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఇది తప్పనిసరి కాదు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న విద్యా సంస్థలు దీన్ని ఉపయోగించవచ్చని జగదీష్ కుమార్ స్పష్టం చేశారు.

#indian-universities #ugc #admissions-twice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe