EC Sensational Decision : ఏపీ(AP)లో ఎప్పుడు ఏ జిల్లాలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్(Polling) సందర్భంగా పల్నాడు, అనంతపురం జిల్లాల్లో సహా చాలా ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ(YCP-TDP) నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో రెండు పార్టీలకు చెందిన చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికి పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: రోజుకు ఎన్నిసార్లు స్నానం చేయాలి? వేడి నీరు నిజంగా మంచిదేనా?
భద్రత విషయంలో పోలీసులు వైఫల్యం చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహా ఈసీ(EC)కి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీతో సమీక్ష నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన పరిస్థితులపై సంచలన నిర్ణయం తీసుకుంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని పోలీస్ ఉన్నతాధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది.
Also Read: వేలికి చేయాల్సిన సర్జరీ నాలుకకు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..?
అయితే, మళ్లీ ఉద్రిక్తతలు చోటు అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 15 రోజుల వరకూ కేంద్రబలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.