సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నియామక పరీక్షలకు ఆ డ్రెస్సులతో వస్తే నో ఎంట్రీ..!! కర్నాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నియామక పరీక్షలకు తల, ముఖం, చెవులు, నోటిని కప్పేలా ఉండే టోపీలు, ఇతర దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లైయిన మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు కేఈఏ తెలిపింది. By Bhoomi 14 Nov 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తల, ముఖం, చెవులు, నోటిని కప్పేలా ఉండే టోపీలను విధిస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు ఇతర దుస్తువులపై కూడా నిషేధం విధించింది. ఎలాంటి మాస్క్‌లు ధరించకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, మైక్రోఫోన్‌లు, వాచీలను పరీక్ష హాలులోకి అనుమతించరు. పరీక్ష గదిలోకి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకెళ్లకూడదు. పరీక్షా కేంద్రంలోకి పెన్సిల్, పేపర్, ఎరేజర్, జామెట్రీ బాక్స్, లాగ్ టేబుల్ తీసుకెళ్లకూడదని తెలిపింది. పెళ్లి అయిన మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు కేఈఏ తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకురావడం తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఇటీవలి రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష చివరి గంట వరకు అభ్యర్థులను పరీక్ష హాలు నుంచి బయటకు రానివ్వబోమని కేఈఏ వెల్లడించింది. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్! అక్టోబర్‌లో కలబురగి శరణ్ బసవేశ్వర యూనివర్సిటీ పరీక్షా కేంద్రంలో ఫస్ట్ క్లాస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో అఫ్జల్‌పూర్‌కు చెందిన త్రిమూర్తి అనే అభ్యర్థి పరీక్షా కేంద్రం బయట నుంచి ఎవరో చెబుతున్న సమాధానాన్ని బ్లూటూత్ ద్వారా రాస్తున్నాట్లు గుర్తించారు.ఈ వ్యవహారం బయటపడటంతో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పరీక్షలకు పాల్పడిన కింగ్‌పిన్ ఆర్‌డి పాటిల్‌కు ఇంటిని అద్దెకు ఇచ్చిన ఆరోపణలపై పోలీసులు ఇటీవల ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పరీక్షా కేంద్రాల్లో తరచూ ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కర్ణాటక పరీక్ష అథారిటీ కఠిన నిబంధనలను అమలు చేసింది. మరి ఈ అక్రమాలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. ఇతర నియమాలు: పురుష అభ్యర్థులకు: -పరీక్ష రోజు చేతుల చొక్కాలు ధరించకూడదు -అధిక పాకెట్స్ ఉన్న జీన్స్ ధరించకూడదు, బట్టలు తేలికగా ఉండాలి -పాదరక్షలు ధరించి పరీక్షా కేంద్రానికి రాకూడదు. -ఎలాంటి లోహపు ఆభరణాలు, కంకణాలు ధరించవద్దు మహిళలకు: -మహిళా అభ్యర్థులు ఎంబ్రాయిడరీ, పువ్వులు, బౌచ్‌లు లేదా బటన్‌లతో కూడిన బట్టలు ధరించడం నిషేధించబడింది. -పరీక్ష రోజున పూర్తి చేతుల బట్టలు / జీన్స్ ధరించకూడదు, బదులుగా హాఫ్ స్లీవ్ బట్టలు వేసుకోవాలి. . -ఎత్తు మడమల బూట్లు చెప్పులు ధరించకూడదు. KEA: Dress code & other guidelines for Recruitment Exam which will start from 18th Nov. pic.twitter.com/uSZ5EomGrs — KEA (@KEA_karnataka) November 13, 2023 #banned #kea #karnataka-examinations-authority #high-heels #jeans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి