Foot Tips: పాదాలు పగిలి నడవలేకపోతున్నారా..?..ఇది ట్రై చేయండి
చలికాలంలో ఎక్కువగా పాదాలు పగులుతుంటాయి. తేనె, వెజిటబుల్ ఆయిల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పాదాలను శుభ్రం చేసి ఈ మిశ్రమంలో 20 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత పాదాలను ఆరబెట్టి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.