Senior Actor Parthiban Apologies To Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ పై సీనియర్ నటుడు పార్తిబన్ (Parthiban) పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తమన్నా డ్యాన్స్ పై ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'టిన్జ్' సినిమా సక్సెస్‌లో భాగంగా ఆయన తమన్నా గురించి వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు సినిమాలో కథ ఉందా? లేదా అనేది చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది" అని అన్నారు. తమన్నా జైలర్, బాక్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడంతో ఆమెను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు భావించారు.
Also Read : రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. బయటపడ్డ రహస్యాలు!
అంతేకాదు తమన్నాపై ఆయన చేసిన కామెంట్స్ ను తప్పు బట్టారు. ఈనేపథ్యంలోనే తాజాగా పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు (Cine Industry) చెందిన వారందరిపైనా తనకు గౌరవం ఉందన్నారు. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదన్నారు. తన మాటలు ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించమని కోరారు. ఇక పార్తీబన్ విషయానికొస్తే.. పలు తమిళ్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ రామ్ చరణ్ 'రచ్చ' సినిమాలో నటించారు.