Telangana New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్! తెలంగాణ కొత్త డీజీపీ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమించేందుకు సీఎం రేవంత్ సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. By V.J Reddy 10 Jul 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Jithender Reddy As Telangana New DGP : తెలంగాణ (Telangana) కొత్త డీజీపీపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమించేందుకు సీఎం రేవంత్ సిద్దమైనట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. వాస్తవానికి మంగళవారం అంటే నిన్ననే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉండగా... సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) పర్యటన నేపథ్యంలో వాయిదా పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి నియమించే తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్ కొనసాగుతున్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఆనాడు రాష్ట్ర డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఎన్నికల కోడ్ ను అంజనీ కుమార్ ఉల్లఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం (Election Commission) వెంటనే డీజీపీ బాధ్యతల నుంచి రిలీవ్ కావాలను అంజనీ కుమార్ కు ఆదేశాలు ఇచ్చింది. రవి గుప్తాను తెలంగాణ డీజీపీగా ఈసీ నియమించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కూడా రవి గుప్తా డీజీపీగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన స్థానంలో జితేందర్ కు నియమించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రైతు కుటుంబం నుంచి.. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు జితేందర్. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆయన తొలి పోస్టింగ్ లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా పని చేశారు. 2004-06 వరకు ఢిల్లీ సీబీఐలో గ్రేహౌండ్స్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం విశాఖపట్నం రేంజ్‌లో డీఐజీగా పదోన్నతి పొంది బాధ్యతలు చేపట్టారు. వరంగల్ రేంజ్ డీఐజీగా తెలంగాణ ఉద్యమం సమయంలో కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత జైళ్లశాఖ డీజీగా, తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Also Read : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన ‘జబర్దస్త్ బ్యూటీ’..! #jithender-reddy #telangana-new-dgp #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి