Telangana: మైనంపల్లికి అన్ని ఆస్తులున్నాయా? రంగంలోకి దిగిన ఈసీ.. విచారణకు ఆదేశం మైనంపల్లి హనుమంతరావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ న్యాయవాది రామారావు లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. By Shiva.K 18 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌కు చిక్కులు తప్పవా..? విలాసవంతమైన కార్లతో వారు చేసే హంగామానే.. వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుందా? ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు? బయట కనిపిస్తున్న విలాసాలకు పొంతన లేదని ఐటీ, ఈసీకి అందుతున్న ఫిర్యాదులతో వారిపై చర్యలు తప్పవా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు. మైనంపల్లి హనుమంతరావు ఫ్యామిలీపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ వీరిపై ఐటీ, ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందే అంశంపై న్యాయవాది రాములు లోకాయుక్త, ఈసీ, ఐటీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. మైనంపల్లి హనుమంతరావు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డాడని లోకాయుక్తలో పిర్యాదు చేశారు న్యాయవాది రామారావు. మైనంపల్లి హనుమంత్ రావు, మైనంపల్లి వాణి, మైనంపల్లి రోహిత్‌ల పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడపెట్టారని ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులకు కోట్ల రూపాయల విదేశీ కార్లు, అరబ్ గుర్రాలు, ఖరీదైన విలాస వస్తువులను బహుమతులుగా ఇచ్చాడని ఆరోపించారు న్యాయవాది. 2017 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి విలువ రూ. 3.50 కోట్లుగా, మైనంపల్లి వాణి ఆస్తి సుమారు రూ. 50 లక్షలుగా చూపించాడని.. కానీ వారు వినియోగించే విలసవంతమైన కార్ల విలువే రూ. 20 కోట్లుకు పైగా ఉంటుందని అన్నారు. 18 విదేశీ కార్లను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం కార్లే కాదు, కోట్ల రూపాయల విలువ చేసే అరబ్ గుర్రాలు, విదేశీ పెంపుడు కుక్కలు, సొంత విమానాలు, విలాస వస్తువులు మైనంపల్లి రోహిత్ స్వంతం అని పేర్కొన్నారు. ఇక ఎలాంటి ప్రాక్టీస్ చెయ్యకుండానే రోహిత్ రెడ్డి 2020లో డాక్టర్ పట్టా పొందారని ఆరోపించారు న్యాయవాది రామారావు. ప్రజా ప్రతినిథి అయిన మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి చెందిన వేల కోట్ల ఆస్తులపై విచారణ చేపట్టాలని, ఆ దిశగా ఆదేశాలివ్వాలంటూ లోకాయుక్తాను కోరారు న్యాయవాది రామారావు. రోహిత్ తన తల్లి వాణితో కలిసి శివశక్తి రియల్టర్స్ ఎల్‌ఎల్‌పి ని 2021లో కేవలం రూ. 2 లక్షల పెట్టుబడితో స్థాపించారని, ఇంత తక్కువ పెట్టుబడితో వేల శాతం లాభాలు ఎలా గడించారని సందేహం వ్యక్తం చేశారు న్యాయవాది. View this post on Instagram A post shared by Dr.Mynampally Rohith (@mynampally.rohith) రంగంలోకి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారులు.. మైనంపల్లి ఆస్తులపై సీనియర్ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదుతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రంగంలోకి దిగారు. మైనంపల్లి ప్రమాణ పత్రాలపై వివరణ కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివేదిక కోరారు. ఈ మేరకు అధికారిక మెమో 9010/Elecs. D/A /2023-1 జారీ చేశారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి. ఫిర్యాదులో పేర్కొన్న ఆధారాలను నిర్ధారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా రిటర్నింగ్ ఆఫీసర్‌ను ఆదేశించారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి. View this post on Instagram A post shared by Dr.Mynampally Rohith (@mynampally.rohith) View this post on Instagram A post shared by Dr.Mynampally Rohith (@mynampally.rohith) View this post on Instagram A post shared by Dr.Mynampally Rohith (@mynampally.rohith) Also Read: ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు.. రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?! #telangana-elections-2023 #telangana-elections #telangana-politics #mynampally-hanumantha-rao #mynampally-hanumantha-rao-property-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి