Actress Raasi : ప్రభాస్ 'కల్కి' పై అలనాటి స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వాళ్లకు బాగా నచ్చుతుందంటూ..!

'కల్కి' మూవీ గురించి అలనాటి హీరోయిన్ రాశి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాశి.. కల్కి చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూశానని, చాలా థ్రిల్ అయినట్లు చెప్పింది. పిల్లలకు ఈ మూవీ చాలా నచ్చుతుందని పేర్కొంది.

Actress Raasi : ప్రభాస్ 'కల్కి' పై అలనాటి స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వాళ్లకు బాగా నచ్చుతుందంటూ..!
New Update

Senior Actress Raasi Intresting Comments On Kalki Movie :  పాన్ ఇండియా హీరో ప్రభాస్ – టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ తో పాటూ సినీ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. వీరిలో స్టార్ హీరోలు సైతం ఉన్నారు.

ఇక తాజాగా ఈ లిస్ట్ లో అలనాటి అందాల తార, హీరోయిన్ రాశి సైతం చేరారు. 'కల్కి' మూవీ గురించి రాశి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాశి.. కల్కి చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూశానని, చాలా థ్రిల్ అయినట్లు చెప్పింది. "నేను, మా వారు, మా పాప కలసి 'కల్కి' మూవీ చూశాం. మా పాప అయితే 3D గ్లాసెస్ తో బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలకు ఈ మూవీ చాలా నచ్చుతుంది" అని తెలిపింది.

Also Read : గ్లామర్ రోల్స్ చేయకపోవడానికి కారణం అదే : ఐశ్వర్య రాజేష్

అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ.. "భైరవ పాత్రలో నాగ్ అశ్విన్ ప్రభాస్ ను చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు" అని అభినందించింది.
అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల నటన కూడా చాలా బాగుందని.. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ లాగా నిలిచాడని, కమల్ హాసన్ విచిత్రమైన గెటప్ లో చాలా ఆకట్టుకున్నాడు" అంటూ చెప్పింది. దీంతో రాశి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



#senior-actress-raasi #kalki-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి