Actress Amani : నటి ఆమని(Amani) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జంబలకడిపంబ సినిమాతో సినీ ఇండస్ట్రీ(Cine Industry) లో అడుగుపెట్టిన ఈమె అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత మావిచిగురు, అమ్మ దొంగ, అమ్మ దీవెన, ఘరానా బుల్లోడు,ఆ నలుగురు, శ్రీవారి ప్రియురాలు, శుభలగ్నం చిత్రాలలో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసింది ఈ నటి. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు మొదలు, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, సుమన్, నరేష్, జగపతి బాబు వంటి అగ్రహీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు.
ఇది కూడా చదవండి: Vijay: అభిమానుల అత్యుత్సాహం.. హీరో విజయ్ కి గాయాలు!
అయితే తాజాగా ఈ సీనియర్ నటి కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. కెరీర్ తొలి నాళ్లలో తాను ఎదుర్కున్న కాస్టింగ్ కౌచ్ సంబంధించి ఆమె చేసి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కాస్టింగ్ కౌచ్
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్. ప్రతీ రంగంలోనూ ఇలాంటిది ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఈ పేరు మరింత హైలెట్ అవుతుంది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్(Casting Couch) కేవలం ఇప్పటి సమస్య మాత్రమే కాదు అప్పటి సీనియర్ నటులు కూడా దీన్ని ఫేస్ చేసినట్లు తెలుస్తోంది.
కాస్టింగ్ కౌచ్ పై ఆమని కామెంట్స్
ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సీనియర్ నటి ఆమని కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. దీని గురించి మాట్లాడుతూ.. "సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి నాళ్లలో చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాటలతో ఇబ్బంది పెట్టారు . ఓ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ సీన్ కోసం ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో లేదో చూపించండి అంటూ బహిరంగంగా అడిగాడు. దాంతో నేను ఆ పాత్ర చేయనని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. బాడీలో ఎవరికీ చెప్పుకోలేని చోట్లలో కూడా వారికి చూపించాలంటూ ఇబ్బంది పెట్టిన దర్శకులు ఉన్నారని నటి ఆమని చెప్పుకొచ్చారు".
"మరొకసారి మేనేజర్ ఫోన్ చేసి.. స్టోరీ చెప్పడానికి డైరెక్టర్ రమ్మన్నారు అని చెప్పారు. దానికి నేను సరే మా అమ్మను కూడా తీసుకొని వస్తాను అని చెప్పాను. అప్పుడు ఆమె అవసరం లేదు మీరొక్కరు వస్తే చాలు అని అన్నారు. ఇలాంటివి డైరెక్ట్ గా అడగరు.. ఇన్ డైరెక్ట్ గా అడిగేవారు. మొదట్లో ఇలాంటివి ఉంటాయని నాకు తెలియదు. కానీ ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా కామన్’ అని మేనేజర్స్ చెబితే అప్పుడు అర్థమైంది. అలా అని ఇండస్ట్రీలో అందరూ చెడ్డ వాళ్ళు కాదు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నా అదృష్టం కొద్దీ నేను మంచి వాళ్ళతోనే పని చేశాను ఆమని తెలిపారు. "