Chandramohan: చంద్రమోహన్ ఎలా చనిపోయారంటే.. ఇవే కారణాలు ..

ప్రముఖ సీనియర్ నటులు చంద్రమోహన్ అకాల మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొన్నేళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న ఆయనకు తరచూ కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. సోమవారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్ కన్నుమూశారు.

New Update
Chandramohan: చంద్రమోహన్ ఎలా చనిపోయారంటే.. ఇవే కారణాలు ..

ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు తుది శ్వాస విడవడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉదయం 9.45 AM గంటలకు చికిత్స పొందుతూ ఆయన కన్నుముశారు. అయితే గత కొన్నేళ్లుగా చంద్రమోహన్‌ షుగర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు తరచూ కిడ్నీ డయాలసిస్‌ జరుగుతోంది. దీంతో ఆయన ఆరోగ్యరీత్యా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైపోయారు. 55 ఏళ్ల సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించిన చంద్రమోహన్.. ఈ మధ్య సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. గోపిచంద్ హిరోగా నటించిన ఆక్సిజన్ అనే సినిమా ఆయనకు చివరి సినిమా. అలాగే ఆయన తన చివరి రోజుల్లో కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధితో ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఇక ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

'ఎన్నో దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని' ఎన్టీఆర్‌ ఎక్స్ (ట్విట్టర్‌) లో పోస్టు చేశారు.

ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.

వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.

— Jr NTR (@tarak9999) November 11, 2023

సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని  తెలవడం ఎంతో  విషాదకరం.

'సీనియ‌ర్ న‌టుడు చంద్రమోహ‌న్ మృతి బాధాక‌రం. హీరో, కమెడియ‌న్‌, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన ఆయన మరణం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను'. - నారా లోకేశ్‌

'ఆయన మోహం మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలు ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వులు తెప్పిస్తాయి'- సాయి ధరమ్‌ తేజ్‌

'విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'. - కల్యాణ్‌ రామ్‌

Advertisment
తాజా కథనాలు