Sehwag : భారత సీనియర్ స్పినర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కెరీర్ పై మాజీ ఆటగాడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరికొన్ని రోజుల్లో టీ 20 వరల్డ్ కప్(T20 World Cup) సంగ్రామం మొదలవనుండగా ఇప్పటికే పలు దేశాలు తుది జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే భారత ఫైనల్ టీమ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సీజన్ ఐపీఎల్(IPL) లో పలువురు కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తూ వరల్డ్ కప్ సెలక్షన్ కోసం పోటీలు ముందు వరుసలో ఉండగా సీనియర్లు సైతం జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడి సెహ్వాగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: Jr NTR : ముంబై లో ఎన్టీఆర్.. భార్యతో కలిసి డిన్నర్ పార్టీ.. సందడి చేసిన హృతిక్, రణ్ బీర్, ఆలియా!
ఎవరూ ఆసక్తి కూడా చూపరు..
ఈ మేరకు సెహ్వాగ్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు యువ క్రికెటర్లతోపాటు సీనియర్లూ రెడీగా ఉన్నారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శన మాత్రం ఆశించతగ్గట్లు లేదు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రాజస్థాన్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. అశ్విన్ ఆటతీరు మాత్రం నిరాశ పరుస్తోంది. పొట్టి కప్ పరిగణనలోకి తీసుకొనే అవకాశాలు కనిపించట్లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ రేసులో చాహల్, కుల్‌దీప్ ముందున్నారు. వచ్చే ఏడాది జరగబోయే వేలంలో తీసుకొనేందుకు ఎవరూ ఆసక్తి కూడా చూపరు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం ఖాయం. ఏ జట్టైనా ఒక బౌలర్ నుంచి 25-30 పరుగులు కంటే ఎక్కువ ఇవ్వకుండా వికెట్లు తీయాలని కోరుకుంటుంది. అలా జరగకపోతే అతడిని తీసుకోవడం వృథాగానే భావిస్తుంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ జడేజాదే స్థానం' అన్నాడు.