Watch Video: క్షణాల్లో నేలమట్టమైన 22 అంతస్తుల భారీ భవనం.. వీడియో వైరల్

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో లేక్ చార్లెస్‌ నగరంలో 22 అంతస్తుల హెర్జ్ టవర్ భవనం నేలమట్టమయ్యింది. 2020లో లౌరా, డెల్టా తుఫాన్‌ల సంభవించడంతో ఈ భారీ భవనం దెబ్బతింది. అప్పటినుంచి ఇది ఖాళీగా ఉంది. చివరికి అధికారులు ఈ భవనాన్ని కూల్చేశారు.

Watch Video: క్షణాల్లో నేలమట్టమైన 22 అంతస్తుల భారీ భవనం.. వీడియో వైరల్
New Update

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో లేక్ చార్లెస్‌ నగరంలో ఒకప్పుడు చిహ్నంగా ఉండే భారీ భవనం తాజాగా నేలమట్టమయ్యింది. హెర్జ్ టవర్‌గా పిలిచే ఈ ఆకాశ హర్మ్య భవనాన్ని క్షణాల్లోనే కూల్చివేశారు. దీంతో దాదాపు ఐదు అంతస్థుల ఎత్తువరకు దుమ్ము, ధూళి కమ్మేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరవుతున్నాయి. గత 40 ఏళ్ల నుంచి ఈ హెర్జ్‌ టవర్‌.. లేక్ చార్లెస్ నగరానికి ఆకర్షణీయంగా కనిపించేది. అయితే 2020లో ఇక్కడ లౌరా, డెల్టా తుఫాన్‌ల సంభవించడంతో ఈ భారీ భవనం దెబ్బతింది.

Also Read: అగ్రరాజ్య ఎన్నికల ప్రచారంలో నాటు నాటు పాట!

కానీ ఆ భవనానికి ఇన్సురెన్స్ రావడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇంతవరకు దానికి ఎలాంటి మరమ్మతులు జరగలేదు. బిల్డింగ్‌ను రిపేర్ చేయడం కోసం 167 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని దీని ఓనర్లు అంచనా వేశారు. కానీ బిల్డింగ్‌కు మరమ్మతులు చేయలేకపోయారు. గత నాలుగేళ్లుగా ఈ భారీ భవనం ఖాళీగానే ఉంది. ఇక చివరికి లేక్ చార్లెస్ నగర అధికార యంత్రాంగమే.. ఈ భవనాన్ని కూల్చేందుకు సుమారు 7 మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చింది. ఇటీవలే ఈ భవనం లోపల పేలుడు పదార్థాలు పెట్టి నేలమట్టం చేశారు. చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ భవనం కూలిన ప్రదేశం ఎవరి సొంతం అనేది ఇంకా నిర్ణయం కాలేదు. హెర్జ్ టవర్ కూలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరవుతున్నాయి. నెటీజన్లు విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

A skyscraper has been blown up in America: "An abandoned 22-storey building in the state of Louisiana that was once a symbol of the city and now has become a symbol of the devastation from Hurricanes Laura and Delta. It was destroyed after four years of standing idle." pic.twitter.com/JepCP1NN25

— World News Express (@WorldNewsExprex) September 8, 2024

Also Read: ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. ఆస్పత్రిలో అనుమానితుడు

#usa #skyscraper #louisiana #lake-charles
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe